📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Collage: దోస్త్ స్పెషల్ ఫేజ్ లో కాలేజీల్లో చేరడానికి గడువు పొడిగింపు: ఛైర్మన్ బాలకిష్టారెడ్డి

Author Icon By Vanipushpa
Updated: August 9, 2025 • 12:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(Telangana) (దోస్త్) – 2025 అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా స్పెషల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చి సీటు పొందిన విద్యార్థులు కాలేజీల్లో చేరడానికి గడువును పొడిగించారు. ఈ నెల 12 వరకు కాలేజీల్లో చేరడానికి అవకాశం కల్పించినట్టు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్, దోస్త్-2025 కన్వీనర్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి,(Prof.V.Balakrsihnareddy) కళాశాల విద్య కమిషనర్ శ్రీదేవసేన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు వివిధ సంఘాల విజప్తి మేరకు కాలేజీల్లో చేరడానికి గడువును పొడిగించినట్టు తెలిపారు.

Collage: దోస్త్ స్పెషల్ ఫేజ్ లో కాలేజీల్లో చేరడానికి గడువు పొడిగింపు: ఛైర్మన్ బాలకిష్టారెడ్డి

ఈ నెల 12 వరకు అవకాశం

స్పెషల్ ఫేజ్ దరఖాస్తు గడువును జులై 25 నుంచి ఈ నెల 2 వరకు పొడిగించారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకొని సీటు రాని వారు.. కొత్తవారితోపాటు ఈ నెల 3 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి అవకాశం కల్పించారు. ఇప్పటికే కాలేజీల్లో చేరిన వారు వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి అనుమతించ లేదు. ఈ నెల 3 వరకు వెబ్ ఆప్షన్లను ఇచ్చిన వారికి ఈ నెల 6న సీట్ల కేటాయింపు చేశారు. సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 8 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి అవకాశం కల్పించగా.. దానిని కాస్త ఈ నెల 12 వరకు పొడిగించారు. అలాగే కాలేజీల్లో చేరడానికి సైతం ఈ నెల 12 వరకు అవకాశమిచ్చారు. రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలతోపాటు ఎయిడెడ్ కాలేజీల్లో ఉన్న సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో చేరడా నికి ఆగస్టు 13, 14 తేదిల్లో స్పాట్ అడ్మిషన్లకి అవకాశం కల్పించినట్టు ప్రకటనలో తెలిపారు.

తెలంగాణలో ఎన్ని కళాశాలలు ఉన్నాయి?
ఇవి కాకుండా రాష్ట్రంలో 2,900 కంటే ఎక్కువ జూనియర్ కళాశాలలు మరియు 41,360 కి పైగా పాఠశాలలు (వీటిలో 26,000 కి పైగా ప్రభుత్వ పాఠశాలలు), 1000 కి పైగా డిగ్రీ కళాశాలలు, 1300 కి పైగా ప్రొఫెషనల్ కళాశాలలు (2022-23 నాటికి) మరియు మరెన్నో కోచింగ్ మరియు శిక్షణ సంస్థలు ఉన్నాయి.
తెలంగాణలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది?
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఉస్మానియా విశ్వవిద్యాలయం రాష్ట్రంలోనే అతిపెద్దది. ఇది 1918లో స్థాపించబడిన రాష్ట్రంలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయం కూడా. విశ్వవిద్యాలయాలతో పాటు, తెలంగాణలో అనేక పరిశోధన మరియు విద్యా సంస్థలు ఉన్నాయి.

BalakishthaReddy college-admissions deadline-extension DOST Latest News Breaking News special-phase Telangana-education

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.