📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్

Telugu News: Dost Admissions-ప్రభుత్వ కాలేజీల్లో తొలిసారి స్పాట్ అడ్మిషన్లకు అవకాశం

Author Icon By Sushmitha
Updated: September 22, 2025 • 12:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ విద్యా సంవత్సరంలో తొలిసారిగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కూడా స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించారు. దోస్త్ డిగ్రీ(Dost degree) ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ)-2025 ద్వారా నాలుగు విడతల్లో సీట్ల కేటాయింపులు పూర్తయ్యాయి. స్పాట్ అడ్మిషన్లకు ముందు వరకు 1,96,451 మంది విద్యార్థులు చేరారు. గత రెండేళ్లుగా ప్రభుత్వ, యూనివర్సిటీ(University) కాలేజీల్లో సీట్లు మిగిలిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, స్పాట్ అడ్మిషన్లలో చేరిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 15, 16 తేదీల్లో ప్రభుత్వ, యూనివర్సిటీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించారు. ఆ తర్వాత 18, 19 తేదీల్లో ప్రైవేటు కాలేజీల్లో కూడా స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఇచ్చారు.

డిగ్రీ అడ్మిషన్ల గణాంకాలు

దోస్త్ పరిధిలో గురుకుల డిగ్రీ కాలేజీలు కాకుండా మొత్తం 830 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 3,77,907 సీట్లు ఉండగా, 1,69,012 మంది విద్యార్థులు చేరారు. ఇక 79 గురుకుల డిగ్రీ కాలేజీల్లో 23,614 సీట్లు ఉండగా, 11,257 మంది చేరారు. మొత్తం మీద రాష్ట్రంలోని 967 ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో ఇప్పటి వరకు 1,96,451 మంది చేరగా, 2,41,936 సీట్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి. స్పాట్ అడ్మిషన్లలో ఎంతమంది చేరారనే పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

ఈ సంవత్సరం స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఎవరికి కల్పించారు?

ఈ సంవత్సరం తొలిసారిగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కూడా స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించారు.

స్పాట్ అడ్మిషన్లలో చేరిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంటుందా?

లేదు, స్పాట్ అడ్మిషన్లలో చేరిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/attempted-murder-of-daughter-in-law-with-snake-for-dowry/crime/551737/

DOST admissions Google News in Telugu higher education. Latest News in Telugu spot admissions Telangana degree colleges Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.