CM Revanth : కెసిఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము లేదా ? – కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

Read Time:  1 min
CM Revanth : కెసిఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము లేదా ? – కిషన్ రెడ్డి సూటి ప్రశ్న
FONT SIZE
GET APP

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై చర్యల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని తప్పుబడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు చేసారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. గత ఎన్నికల ప్రచారంలో “కేసీఆర్‌కు చిప్పకూడు తినిపిస్తాం, దోచుకున్న సొమ్మును కక్కిస్తాం” అని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వంపై చర్యలు తీసుకునే “దమ్ము” లేకపోతే రేవంత్ రెడ్డి తక్షణమే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేయడం రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది.

CollectorRahulRaj: కలెక్టరేట్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ కుటుంబంపై ఈగ వాలకుండా కాపాడుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని, అందుకే భారీ అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ విచారణలో జాప్యం జరుగుతోందని ఆయన విమర్శించారు. ఒకవేళ ముఖ్యమంత్రిని ఎవరైనా అడ్డుకుంటుంటే, ఆ శక్తులు ఎవరో ప్రజల ముందు బహిర్గతం చేయాలని కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో రేవంత్ రెడ్డి కేవలం మాటలకే పరిమితమయ్యారని, చేతల్లో ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు.

KCR
KCR

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ, ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌పై చర్యలు తీసుకోకపోతే, ఆ రెండు పార్టీలు ఒక్కటేననే ముద్ర వేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్నది కిషన్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు, విచారణలు సాగుతున్నాయని చెబుతున్న కాంగ్రెస్ నేతలు, ఈ విమర్శలను ఎలా తిప్పికొడతారనేది ఆసక్తికరంగా మారింది. అంతిమంగా, గత ప్రభుత్వ అక్రమాలపై నిజంగా విచారణ జరిగి బాధ్యులకు శిక్ష పడుతుందా లేక ఇవన్నీ రాజకీయ విమర్శలకే పరిమితమవుతాయా అని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.