Don Bradman cap auction : ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం Don Bradman ధరించిన చారిత్రక ‘బ్యాగీ గ్రీన్’ టోపీ వేలంలో రికార్డు ధర పలికింది. గోల్డ్ కోస్ట్‌లో జరిగిన వేలంలో ఈ టోపీని ఓ అజ్ఞాత వ్యక్తి 4,60,000 ఆస్ట్రేలియన్ డాలర్లకు (సుమారు రూ.2.92 కోట్లు) సొంతం చేసుకున్నాడు. క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప బ్యాటర్‌గా పేరుగాంచిన బ్రాడ్‌మన్‌కు సంబంధించిన వస్తువుకు ఈ స్థాయి ధర రావడం విశేషంగా మారింది.
ఈ టోపీకి గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది. 1947–48లో భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ సమయంలో బ్రాడ్‌మన్ ఈ క్యాప్‌ను ధరించాడు. ఆ తర్వాత భారత క్రికెటర్ శ్రీరంగ వాసుదేవ్ సోహోనీకి వ్యక్తిగతంగా బహుమతిగా ఇచ్చాడు. అప్పటి నుంచి సుమారు 70 ఏళ్లుగా సోహోనీ కుటుంబం ఈ టోపీని మూడు తరాలపాటు ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తూ వచ్చింది.
Read Also: Sikkim Border: 16,000 అడుగుల ఎత్తులో భారత సైనికుల గణతంత్ర వేడుకలు
ఇంతకాలం గడిచినా టోపీ అద్భుతమైన కండిషన్‌లో ఉండటం దీని విలువను భారీగా పెంచింది. క్యాప్ లోపల ‘డి.జి. బ్రాడ్‌మన్’, ‘ఎస్.డబ్ల్యూ. సోహోనీ’ అని చేతిరాతతో ఉండటం దీనికి మరింత ప్రామాణికతను చేకూర్చింది. బ్రాడ్‌మన్ తన కెరీర్‌లో 52 టెస్టుల్లో 99.94 సగటుతో పరుగులు చేసి క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేశాడు. తాజాగా ఈ క్యాప్‌ను మ్యూజియంలో ప్రదర్శించే అవకాశం ఉందని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంటోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: