దీపావళి పండుగ సమయం దగ్గరపడటంతో హైదరాబాద్ (Hyderabad) నుంచి తమ సొంత ఊరులకెళ్తున్న ప్రయాణికులు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ఈ పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని టికెట్ ధరల (Ticket prices) ను అమాంతంగా పెంచేశారు. సాధారణ రోజుల్లో సుమారుగా రూ.500 మాత్రమే ఉంటే, ఇప్పుడు ఈ సమయంలో టికెట్ ధరలు రూ.1000 నుండి రూ.1500 వరకు పెరిగాయని ప్రయాణికులు వాపోతున్నారు.
Read Also: Metro Rail:డబుల్ డెక్కర్ వంతెనలకు బ్రేక్.. నిర్వహణ ఖర్చులే కారణమా?
చాలా మంది ప్రయాణికులు తాము ఊరికి వెళ్లేందుకు ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ, కొద్దీ మందికి ధరల పెరుగుదల వల్ల జేబు భారంగా మారింది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు,మధ్య తరగతి కుటుంబాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతోంది.
టికెట్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ కొరవడటంతోనే ప్రైవేట్ ట్రావెల్స్ (Private Travels) యాజమాన్యాలు ఇలా దోపిడీకి పాల్పడుతున్నాయని పలువురు మండిపడుతున్నారు. పెరిగిన ధరలతో పండుగ పూట జేబులకు చిల్లు పడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు.
ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది
ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు (టీజీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ) ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించాయి. పండుగ రద్దీని తగ్గించేందుకు ఈ అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.మరోవైపు, దక్షిణ మధ్య రైల్వే కూడా దీపావళి రద్దీని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది.
అక్టోబర్ 17 నుంచి 23 వరకు మొత్తం 26 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి, లింగంపల్లి స్టేషన్ల నుంచి విజయవాడ, తిరుపతి, చెన్నై, భువనేశ్వర్, యశ్వంత్‌పూర్ వంటి ప్రాంతాలకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.ఇక విమాన ప్రయాణాల విషయానికొస్తే,
గతేడాది దీపావళితో పోలిస్తే ఈసారి టికెట్ బుకింగ్స్ 15 నుంచి 20 శాతం పెరిగాయని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. వీటిలో దాదాపు 65 నుంచి 70 శాతం వరకు విహార యాత్రల కోసమే కావడం గమనార్హం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: