📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Digital Agriculture: ఒక్క క్లిక్ తో పొలం వద్దకే యంత్రాలు

Author Icon By Saritha
Updated: February 12, 2026 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : వ్యవసాయంలో యాంత్రీకరణను వేగవంతం చేయడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ (Agriculture Department) కొత్త (Digital Agriculture) డిజిటల్ విధానానికి శ్రీకారం చుడుతోంది. టాక్సీ సేవల మాదిరిగా ఐ ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, డ్రోన్లు వంటి వ్యవసాయ యంత్రాలను మొబైల్లోనే బుక్ చేసుకునేలా ప్రత్యేకంగా ఫామ్ యాప్ ను అభివృద్ధి చేసేందుకు కసత్తు ప్రారంభించింది. యూరియా యాప్ రూ పొందించిన విధంగానే తాజాగా సాగులో అవసరమైన యంత్రాలను సైతం డిజిటల్ పద్దతిలో రైతులకు సరఫరా చేసేందుకు నిర్ణయించింది. ఈ విధానంతో ముఖ్యంగా రైతుల వనిభారం తగ్గించడమే కాకుండా త్వరితగతిన వ్యవసాయ పనులు పూర్తయ్యే లక్ష్యంగా ఈ యాప్ను తీసుకొస్తోంది.

Read Also: Telangana: నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా!

Digital Agriculture Machines at the farm with just one click

రైతుల కోసం డిజిటల్ ఫార్మ్ యాప్

ఈ యాప్ (Digital Agriculture) అందుబాటులోకి వస్తే రైతులు తమ గ్రామ పరిధిలో ఉన్న యంత్రాల వివరాలు మొబైల్లోనే చూసి, అవసరమైన తేదీ సమయం ఎంచుకుని బుక్ చేసుకునే కొత్త డిజిటల్ విధానానికి వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టింది. దీని వల్ల వెనులుబాటు, సమయం ఆదా అవుతుంది. బుకింగ్ చేసిన వెంటనే యంత్ర యజమాని వివరాలు అందుతాయి. నిర్ణయించిన సమయానికి యంత్రం పొలం వద్దకు చేరుకుని దున్నడం, నాట్లు వేయడం, మందులు పిచికారీ చేయడం వంటి పనులు పూర్తి చేస్తుంది. కాగా ప్రతీ వంటల సీజన్లలో యంత్రాల కొరత రైతులకు పెద్ద సమస్యగా మారుతోంది. ఒకేసారి కోతలు మొదలైతే హార్వెస్టర్లు, మక్కజొన్న కోసే యంత్రాలు దొరకక రైతులు రోజులు వేచి చూడాల్సి వస్తోంది.

సమస్యను పరిష్కరించేందుకు గత కొన్ని సంవత్సరాలుగా పరిశీలనలో ఉన్న ప్రణాళిక ఇప్పుడు కార్యరూపం దాల్చే దశకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ ఈ సేవలకు వాడుతున్న యాప్ నమూనాను పరిశీలించి, మరింత విస్తృతంగా అమలు చేయాలనే ఆలోచనలో రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. ఫామ్ యాప్ వల్ల రైతులు కూలీలపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. గ్రామాల్లో పెరుగుతున్న కూలీల కొరత కారణంగా వంటలు ఆలస్యమవుతున్న పరిస్థితికి చెక్ పడుతుంది. యంత్రాలతో పనులు త్వరగా పూర్తవడంతో సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా ధరల విషయంలో పారదర్శకత పెరిగి, మధ్యవర్తుల సమస్య కూడా తగ్గే అవకాశం ఉంది. డ్రోన్ల వినియోగం వల్ల ఎరువులు, పురుగుమందులు శాస్త్రీయంగా పిచికారీ చేయవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Digital agriculture drones Farm App Farm Mechanization Harvesters hyderabad iTractors Latest News in Telugu Telangana agriculture Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.