తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమీషన్లమయంగా మారిపోయిందని బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind) ఆరోపించారు. టోకెను ఇంత అని కమీషన్ పెట్టి బహిరంగంగానే వసూలు చేస్తున్నారని విమర్శలు చేశారు. దోచుకుందాం అనే తరహాలో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు ఆదివారం ఢిల్లీలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనపై అర్వింద్ ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్కు ప్రజలకు మంచి చేయాలనే కనీస ఉద్దేశం లేదని ఆరోపించారు.
Read Also: Telangana Heritage: జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణకు రెడీ
రుణమాఫీ అమలులో పెద్ద వైఫల్యం
కాంగ్రెస్కు అధికారం లాటరీలో అదృష్టంగా తలుపు తట్టడంతో దోచుకుందాం అనే తరహాలో రేవంత్ ప్రభుత్వం వ్యవహరి స్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంవల్ల గత రెండేళ్లలో 790 మంది రైతుల ఆత్మహత్య(suicide)లు చేసుకున్నారని ఆరోపించారు. రెండు లక్షల రుణమాఫీ సరిగా చేయలేదని ఆవేదన చెందారు. ఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా అంటున్నారనీ ఆయన అన్నారు. ఫుట్బాల్ ఆడడానికి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడా?. కేంద్రం నుంచి నిధులు వాటిని సరిగా వినియోగించడం లేదని ఆరోపించారు. వస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బాగోగులు పట్టించుకోవడం లేదు.
విద్యా, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం
ఫుడ్ పాయిజన్ విద్యార్థులందరూ ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 50శాతం ఖాళీలు ఉన్నాయనీ దీనితో వైద్యం లభించని పరిస్థితి నెలకొందని అన్నారు. రెండేళ్లు పూర్తి చేసుకున్నందుకు కాంగ్రెస్, రేవంత్ రెడ్డికి కంగ్రాట్యులేషన్స్ తెలిపారు. ఈ రెండు సంవత్సరాల్లో బాగా సంపాదించుకున్నారని ఆరోపణలు చేశారు. చాలా పద్ధతిగా అవినీతి జరిగిందని, మంత్రులు వాళ్ల బంధువులు, రేవంత్ బంధువులు బాగా సంపాదించారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రజా వంచన చేసిందని ఆక్షేపించారు.
బీజేపీలో విభేదాలు లేవని స్పష్టం
ఇచ్చిన ఒక్క హామీని కూడా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నల వర్షం కురిపించారు ఎంపీ అరవింద్(Dharmapuri Arvind). హిందూ దేవుళ్లపై రేవంత్రెడ్డికి ఎందుకంత కోపమని ధర్మపురి నిలదీశారు. కాంగ్రెస్ అంటే ముస్లింలని రేవంత్రెడ్డి అన్నారని ఆరోపించారు. కెసిఆర్, కెటిఆర్లను ఎందుకు జైల్లో వేయడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. బిజెపిలో మేమంతా ఒక్కటి గానే ఉన్నామనీమా మధ్య సఖ్యత ఉందనీ తెలంగాణ బిజెపి నాయకుల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవనీ ఆయన వివరించారు బిజెపి అధ్యక్షుడు రాంచందర్ రావు నాకు పెద్దన్న లాంటి వారనీ ఆయన నాయకత్వంలో పని చేస్తూనే ఉన్నామని రాష్ట్రంలో పార్టీ సంస్థాగతంగా బలపడుతుందనీ చెప్పారు వచ్చే ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తామనీ అరవింద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: