📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

DGP Shivadhar Reddy: మావోల రహిత రాష్ట్రంగా తెలంగాణ

Author Icon By Saritha
Updated: January 6, 2026 • 12:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కగార్ గడువులోపే లక్ష్య సాధన

హైదరాబాద్ : వచ్చే మార్చి నాటికి దేశంలో మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని కేంద్రం ప్రకటించడం తెలిసిందే. ఇందులో భాగంగా నక్సలైట్ల ఏరివేతకు వీరి ప్రభావం వున్న ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిషాలో ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తుండడం విదితమే. ఈ క్రమంలో ఆ మూడు రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలలలో భారీగా నక్సలైట్లు లొంగిపోతున్నారు. (DGP Shivadhar Reddy) అయితే ఆపరేషన్ కగార్ గడువులోపే తెలంగాణను (TG) మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు పోలీసు శాఖ కసరత్తులు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మావోయిస్టు పార్టీలో తెలంగాణ నుంచి వున్న 17 మందిని లొంగిపోయేలా చేసేందుకు చర్యలను వేగవంతం చేసింది. ఈ నెల మూడవ తేదీన మావోయిస్టు పార్టీకి చెందిన పీపుల్స్ ఆర్మీ గెరిల్లా దళంలో కీలకంగా వున్న దేవాతో పాటు 20 మంది నక్సలైట్లు భారీ ఎత్తున ఆయుధాలతో సహా లొంగిపోవడం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన బ్యానర్ చర్చనీయాంశంగా మారింది, పతనం అంచున మావోయిస్టు పిఎల్ఎ అని బ్యానర్ను ప్రదర్శించారు. నక్సలైట్ల లొంగుబాటు సందర్భంగా పోలీసు శాఖ ఇలాంటి బ్యానర్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. దీనిని హక్కుల సంఘాలు అభ్యంతరం చెబుతున్నా పోలీసులు సమర్థించుకున్నారు.

Read also: Medaram Jatara: వాళ్లందరికీ స్పెషల్ డ్యూటీలు

Telangana is a Maoist-free state..DGP Shivadhar Reddy

మిగిలిన 17 మందిని లొంగించేందుకు ప్రత్యేక చర్యలు

ఈ సమావేశంలో మావోయిస్టు పార్టీలో తెలంగాణ నుంచి మిగిలిన వారు 17 మంది మాత్రమే వున్నా రని డిజిపి శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) తెలిపారు. వీరు కూడా వెంటనే లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో కలిసిన వారికి పున రావాసం కల్పిస్తామని, రివా ర్డులు వారికే అందజేస్తామని తెలిపారు. దీని తరువాత 17 మంది మావోయిస్టులను లొంగిపోయేలా చేసేందుకు పోలీసు శాఖ చర్యలను వేగవంతం చేసింది. ఓవైపు వారి స్వగ్రామాలలో ఆయా జిల్లాల పోలీసు అధికారులు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ జనజీవన స్రవంతిలో కలవాలని పిలు పు ఇచ్చేలా చేస్తున్నారు, వయో వృద్ధులైన మావోయిస్టుల తల్లిదండ్రులకు పోలీసులు ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు కొన్ని నెలలకు సరిపడ ని త్యావసర సరుకులు అందజేస్తున్నారు. ఈ తరహా కార్యక్రమం ఇటీవలే మొదలైంది. మరోవైపు నక్సలైట్ల లొంగుబాటుపై రాష్ట్ర పోలీసు శాఖ సోమవారం నాడు ఒక ప్రకటన విడుదల చేస్తూ మావోయిస్టు పార్టీలో మిగిలిన 17 మంది ప్రజల్లో కలవాలని కోరింది. వీరి పేరిట వున్న రెండు కోట్ల 25 లక్షల రూపాయల రివార్డు వీరికే ఇస్తామని పేర్కొంది. వారిని అన్ని విధాల ఆదుకుంటామని తెలిపింది.

రాష్ట్రం మావోయిస్టు రహితంగా చరిత్ర సృష్టం

కాగా మావోయిస్టు పార్టీలో తెలంగాణ నుంచి వున్న వారిలో ఐదుగురు మహిళలు వున్నారని పోలీసు శాఖ తెలిపింది. 17 మందిలో నలుగురు కేంద్ర కమిటీలో ఐదుగురు రాష్ట్ర కమిటీలో ఐదుగురు, డివిజన్ కమిటీలో ఆరుగురు వుండగా మరొకరు అ జ్ఞాతంలో వున్నారని పోలీసు శాఖ వెల్లడించింది. కేంద్ర కమిటీలో రాష్ట్రం నుంచి వున్న వారిలో పార్టీ అగ్రనేత ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా చెబుతున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్లారాజి రెడ్డి అలియాస్ సంగ్రాం, పసునూరి నరహరి అలియాస్ సంతోష్ వుండగా రాష్ట్ర కమిటీ సభ్యులుగా ముప్పిడి సాంబయ్య అలియాస్ సు దర్శన్, వార్త శేఖర్ అలియాస్ మంగుత్, జోడే రత్నా భాయ్, నక్కా సుశీల, లోకేటి చంద్రశేఖర్, దామోదర్ వున్నారు. డివిజన్ కమిటీ సభ్యులుగా రాజేశ్వరి, రంగబోయిన భాగ్య, బాడిషా ఉంగా, సంగీత, భవాని, మైసయ్య, భగత్ సింగ్లు వున్నారు. మావోయిస్టులు వెంటనే లొంగిపోతే ఆపరే షన్ కగార్ గడువులోగానే తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారి చరిత్ర సృష్టిస్తుందని పోలీసు శాఖ చెబుతోంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:



DGP Shivdhar Reddy Latest News in Telugu Maoist Free Telangana Maoist Surrender Naxalite Issue Operation Kagar telangana police Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.