📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

DGP జితేందర్ : పాకిస్తానీయులు దేశం విడిచిపెట్టాలి

Author Icon By Digital
Updated: April 26, 2025 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

DGP జితేందర్ : 30 లోపు దేశం వీడాలి: పాకిస్తానీయులకు డీజీపీ జితేందర్ హెచ్చరిక

ప్రభాతవార్త ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు డీజీపీ జితేందర్ అప్రమత్తమయ్యారు. తెలంగాణలో ఉన్న పాకిస్తానీయులపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వీసాలు పొందిన పాకిస్తానీయులకు ఈ నెల 27వ తేదీ వరకే గడువు ఉందని తెలిపారు. ఈ మేరకు హైఅలర్ట్ ప్రకటించడంతో పాటు, హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీయులు ఉన్నట్టు సమాచారం వెల్లడైంది.తక్షణమే తెలంగాణలో ఉన్న పాకిస్తానీయులు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 27 తర్వాత వారి వీసాలు రద్దు చేస్తామని, ఆలోపే వెళ్లిపోవాలని హెచ్చరించారు. మెడికల్ వీసా దారులకు మాత్రం ఈ నెల 29వ తేదీ వరకూ సమయం ఇచ్చారు. ఆ తర్వాత క్షణం కూడా భారత్‌లో ఉండటానికి అనుమతి లేదని డీజీపీ స్పష్టం చేశారు.

DGP జితేందర్ : పాకిస్తానీయులు దేశం విడిచిపెట్టాలి

తెలంగాణలో ఉన్న పాకిస్తానీయులకు డీజీపీ జితేందర్ కఠిన ఆదేశాలు

తెలంగాణలో అక్రమంగా ఉండాలని చూస్తే ఊరుకోమని, వారిని జల్లెడ పట్టి బయటకు తీస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈనెల 30వ తేదీ వరకు అటారి వాఘా బార్డర్ ఓపెన్ ఉంటుంది. పాకిస్తానీయులపై నిఘా పెట్టామని అధికారులు తెలిపారు.ఇకముందే కేంద్రం 48 గంటల్లో దేశాన్ని వీడాలని పాక్ నేషనల్స్‌కి ఆదేశించింది. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి, చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రాల్లో ఉన్న పాక్ పౌరులను గుర్తించి కేంద్రానికి సమాచారం అందించాలని, అప్పుడే వారి వీసాలను రద్దు చేయడం సులభమవుతుందన్నారు.గతంలో సార్క్ వీసా పొడిగింపు పథకం కింద పాకిస్తానీయులకు భారత్ పర్యటనకు అవకాశం కల్పించబడింది. ఇప్పుడు అదే కార్యక్రమంలో ఉన్నవారు కూడా 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Read More : Cabinet Expansion : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశంపై టీపీసీసీ చీఫ్ ఏమన్నాడంటే !

Amit Shah orders Breaking News in Telugu DGP Jitender Google News in Telugu Hyderabad News illegal immigrants India Pakistan visa cancel Paper Telugu News Telangana police alert Telugu News Telugu News online Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.