మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు
మధిరలో మీడియాతో డి.సిఎం భట్టి
మధిర : రెండేళ్ల ప్రజా ప్రభుత్వ కాలంలో రాష్ట్రం ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల తో పోటీ పడే స్థాయికి ఎదుగుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఒడి ఒడిగా ముందుకు సాగడానికి, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు చేరడానికి ఎన్నికలు జరుగుతున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(DeputyCM Bhatti) మల్లు విజప్తిచేశారు. సోమవారం ఆయన మధిరలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్, విద్యా రెండు శాఖలు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్నాయని, ఈ రెండు శాఖలపై ప్రత్యేకంగా దృష్టి సారించి ముందుకు తీసుకు వెళ్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ నగరాలు పట్టణాలన్నిటిలో సాధ్యమైనంత మేరకు మోలిక సదుపాయాలను, మెరుగైన వసతులు కల్పిస్తూ ముందుకు పోతుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు జవాబుదారీగా ఉండాలని శాంతియుత వాతావరణంలో పట్టణాలు అభివృద్ధి చెందాలని అధికారులను ఆదేశించమన్నారు.
Read Also: TG Municipal : కాంగ్రెస్ VS బీజేపీ – ‘రూ.100 కోట్లకు మేయర్ సీటు’
అంతటా ప్రశాంత వాతా వరణం నెలకొందని తెలిపారు. మురుగు నీటిని శుద్ధి చేసేందుకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎస్టీపీలు మంజూరు చేశారని, పట్టణాల్లో ఆసుపత్రులు, విద్యావ్యవస్థ, ఎలక్ట్రిసిటీ ఈ రంగాల్లో ప్రపంచంలో వస్తున్న పరిణామాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే స్కిల్స్ ఉన్న కోర్సులు నేర్పించాలి అందుకే రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఐటిఐ లను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామని, ఇవన్నీ కార్పొరేషన్లు, మున్సిపల్ కేంద్రాల్లోనే ఉన్నాయని తెలిపారు. రాబోయే 50 సంవత్సరాలకు మధిర పట్టణ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నట్టు డిప్యూటీ సీఎం వివరించారు. 2047 విజన్ డాక్యుమెంట్ ను ఇటీవల గ్లోబల్ సమీట్లో విడుదల చేశాం.
మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాం ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకుందని తెలిపారు. రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన వారు పట్టణాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు అన్ని రంగాలను గాలికి వదిలేసారని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగింపుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని కోరిన ఆయన, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ప్రతి నెల 1న వారి బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమ చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం కోటి రూపాయల ప్రమాద బీమా కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం ఇవన్నీ నిరంతరం కొనసాగాలి, ఉద్యోగులు ప్రభుత్వంతో కలిసి నడవాలి ఉద్యోగ వర్గాలు కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని డిప్యూటీ సీఎం కోరారు. అర్హత కలిగిన పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చామని, 1.03 కోట్ల కుటుంబాలకు సన్నబియాన్ని అందజేస్తున్నామని తెలిపారు అలాగే 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.
మహిళల ఉచిత బస్సు సౌకర్యాలు కల్పించామని, తెలిపారు. ఆధునిక స్మశాన వాటిక, మురుగునీరు కనబడకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, భారీ వర్షాలు వరదలు వచ్చిన విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా విద్యుత్ సరఫరా ఒంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు(DeputyCM Bhatti) తెలిపారు. మురుగునీరు, వరద నీరు కలిసి పారకుండా శుద్ధి చేసి బయటకి వదిలేందుకు ఎస్టిపి నిర్మాణం చేస్తున్నట్టు తెలిపారు. మధిర పట్టణానికి ప్రవేశించే మార్గాల్లో ఆహ్లాదకర వాతావరణ ఉండేందుకు పార్కులు నిర్మిస్తున్నామని తెలిపారు. మై మధిర క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, సూరంశెట్టి కిషోర్ మిర్యాల రమణ రుషా ఉన్నారు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: