📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana Anganwadi: అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఇకపై రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్!

Author Icon By Aanusha
Updated: March 1, 2026 • 12:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana Anganwadi: తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు, చిన్నారుల్లో పోషకలోపాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అంగన్‌వాడీ బడులకు వచ్చే చిన్న పిల్లలకు ఉదయం పూట పౌష్ఠికాహారంతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ (అల్పాహారం) అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది చిన్నారులకు ఈ పథకం ద్వారా మేలు చేకూరనుంది.

Read Also: Homes Demolitions on Bhoodan Lands : ఖమ్మం కూల్చివేతలపై ఎన్హెన్ఆర్సీ దర్యాప్తు?

పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం

ఈ మేరకు తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. త్వరలో ప్రయోగాత్మక ప్రాజెక్టు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.మారుమూల జిల్లాలు, ఏజెన్సీల్లోని కౌమార బాలికల్లో రక్తహీనత తగ్గించేందుకు అదనపు పోషకాహార పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.

Delicious breakfast for children in Anganwadis now available!

ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రతిపాదనలు రెడీ చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఈనెల 20న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో శుక్రవారం (ఫిబ్రవరి 27) శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో ఆ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషనర్‌ శ్రుతి ఓజాతో కలిసి బడ్జెట్‌ కేటాయింపులు, అమలవుతున్న పథకాలు, ఖర్చులు, చేపట్టే కార్యక్రమాలపై జిల్లా సంక్షేమశాఖ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Child Welfare Telangana minister seethakka Nutritious Food for Kids Telangana Anganwadi Breakfast Scheme

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.