📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Delhi Liquor Case: సత్యం నా తోడుగా ఉంది.. విచారణకు సహకరిస్తా: కవిత

Author Icon By Anusha
Updated: March 12, 2026 • 4:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనకు అందిన కోర్టు నోటీసులపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తాజాగా స్పందించారు.’నోటీసులపై లీగల్ టీమ్‌తో చర్చిస్తున్నా. సత్యం నా తోడుగా ఉంది. ఈ కేసులో విచారణకు సంపూర్ణంగా అధికారులకు సహకరిస్తా. కేసు విచారణ ఈ నెల 16న ఉందని సీబీఐ అధికారులు చెప్పారు. ఈ కేసులో చార్జెస్ ఫేమ్ చేయడానికి కూడా రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. అందుకే కేసును కొట్టివేసింది’ అని ట్వీట్ చేశారు.

Read Also: Telangana: ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు..స్పీకర్ నిర్ణయానికే సుప్రీంకోర్టు మొగ్గు

కథ మళ్లీ మొదటికి

ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయని, ‘సౌత్ గ్రూప్’ తరపున కవిత కీలక పాత్ర పోషించారనే ఆరోపణలతో దర్యాప్తు సంస్థలు విచారణ జరిపాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్‌లో సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా 23 మందిని ఈ కేసు నుండి విముక్తి కల్పిస్తూ క్లీన్‌చిట్ ఇచ్చింది. అయితే, ఈ తీర్పును సీబీఐ హైకోర్టులో సవాలు చేయడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.

మార్చి 15, 2024న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి, సాయంత్రం వేళ ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. తొలుత ఈడీ కస్టడీలో, ఆ తర్వాత సీబీఐ అరెస్ట్ చేయడంతో కవిత సుమారు ఐదున్నర నెలల పాటు తిహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుతో ఊపిరి పీల్చుకున్న కవితకు.. సీబీఐ హైకోర్టును ఆశ్రయించడం కొత్త తలనొప్పిగా మారింది. ఛార్జిషీట్‌లో పేర్కొన్న ఆధారాలను మరోసారి పరిశీలించాలని, కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని సీబీఐ పట్టుబడుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

CBI Notices Delhi High Court Delhi liquor scam kavitha tweet Rouse Avenue Court

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.