📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

రాజాసింగ్‌ ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాల తొలగింపు

Author Icon By sumalatha chinthakayala
Updated: February 21, 2025 • 11:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు చెందిన 2 ఫేస్‌బుక్‌ పేజీలు, 3 ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను తొలగించడంపై ఆయన ఎక్స్‌ లో స్పందించారు. హిందువులను లక్ష్యంగా చేసుకొని సెలెక్టివ్‌ సెన్సార్‌షిప్‌ దాడి చేస్తోంది. గురువారం నా కుటుంబం, స్నేహితులు, కార్యకర్తలు, మద్దతుదారుల సోషల్‌ మీడియా ఖాతాలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ బ్లాక్‌ చేయడం దురదృష్టకరం. అంతకుముందు రాహుల్‌గాంధీ చేసిన ఫిర్యాదు ఆధారంగా నా అధికారిక ఖాతాలకు అన్యాయం జరిగింది అన్నారు.

నా ఖాతాలను తొలగించడం దురదృష్టకరమన్న రాజాసింగ్

రాజాసింగ్‌

ద్వేషపూరిత ప్రసంగాలు…

కాగా, 2024 లోక్‌సభ ఎన్నికలు జరిగిన ఏప్రిల్, జూన్ నెలల మధ్య సీనియర్ బీజేపీ నాయకులు చేసిన 266 మైనారిటీ వ్యతిరేక ద్వేషపూరిత ప్రసంగాలు అధికారిక పార్టీ ఖాతాల ద్వారా యూట్యూబ్, ఫేస్‌బుక్ ఎక్స్ లలో ప్రత్యక్ష ప్రసారం చేశారని నివేదిక పేర్కొంది. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన రాజా సింగ్ ద్వేషపూరిత ప్రసంగాల్లో 74.5 శాతం ద్వేషపూరితమని ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక పేర్కొంది. రాజా సింగ్ చేసిన 259 ద్వేషపూరిత ప్రసంగాల కేసుల్లో, ముఖ్యంగా భారతదేశంలోని ముస్లింలపై, మైనారిటీ వర్గాలపై హింసకు ప్రత్యక్ష పిలుపు ఇచ్చారని గుర్తించింది. రాజాసింగ్ చేసిన 219 ప్రసంగాలు మొదట్లో సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీటిని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఫేస్‌బుక్‌లో అత్యధికంగా 164 ప్రసంగాలు పోస్టు చేశారు. రాజాసింగ్ చేసిన మొత్తం ప్రసంగాలలో 74.9 శాతం, తరువాత యూట్యూబ్‌లో 22.4 శాతం,ఇన్‌స్టాగ్రామ్‌లో ఆరు ద్వేషపూరితమని తేల్చారు.

రాజాసింగ్ ఖాతాలు తొలగింపు – వివాదాస్పద నిర్ణయమా?

ఈ చర్యను రాజకీయ కూటములకు అనుకూలంగా వ్యాఖ్యానించవచ్చు. కొందరు ఇది స్వేచ్ఛా హక్కుల ఉల్లంఘన అని చెబుతుండగా, మరికొందరు ద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు తీసుకున్న చర్య అని అంటున్నారు.

సోషల్ మీడియా నియంత్రణపై వాదనలు

సమాజ మాధ్యమాల్లో వివాదాస్పద నేతల ఖాతాలు తొలగించడం కొత్త విషయం కాదు. గతంలో కూడా వివిధ దేశాల్లో సామాజిక మాధ్యమాల నియంత్రణపై పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ద్వేషపూరిత ప్రసంగాలను నియంత్రించడం అవసరమా లేదా స్వేచ్ఛాప్రాయ అభివ్యక్తిని అణచివేయడమా? అనే ప్రశ్నలపై పెద్ద చర్చ నడుస్తోంది.

రాజకీయ ప్రభావం

రాజాసింగ్ ఖాతాల తొలగింపు ఘటన బీజేపీ వర్గాల్లో అసంతృప్తిని కలిగించింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలాంటి చర్యలు పార్టీ ఇమేజ్‌పై ప్రభావం చూపుతాయా? అన్నది కూడా రాజకీయ విశ్లేషకుల దృష్టిలో ఉంది.

Breaking News in Telugu Deletion Facebook Google news Google News in Telugu Instagram accounts Latest News in Telugu Raja Singh Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.