35,954 మంది రిజిస్టర్.. 46,886 మంది వెన్ఆప్షన్లు
Hyderabad: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరడానికి నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) -2025లో రెండో విడత సీట్ల కేటాయింపు నేడు(శుక్రవారం) చేయనున్నారు. ఇప్పటికే మొదటి విడత సీట్ల కేటాయింపు చేయగా.. అందులో 41,285 మంది కాలేజీల్లో చేరడానికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. రెండో విడతలో రెజిస్ట్రేషన్ కి అవకాశం ఇవ్వగా.. వారిలో ఫీజు చెల్లించిన వారు వెబ్ ఆప్షన్లను ఇచ్చిన వారిని నేడు సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు.
రెండో విడతలో 35,954 మంది రిజిస్టర్ చేసుకోగా వారిలో 33,409 మంది ఫీజును చెల్లించారు. 34,276 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. రెండో విడతలో 46,886 మంది వెబ్ ఆప్షన్లను ఇచ్చారు. వారికి నేడు సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు.
18లోపుగా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి
సీటు పొందిన వారు ఈ నెల 18 వరకు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మూడో విడత రిజిస్ట్రేషన్లను ఈ నెల 13 నుంచి 19 వరకు అవకాశం కల్పించారు దోస్త్ అధికారులు. దరఖాస్తు సమయంలోనే వెబ్ ఆప్షన్లకు అవకాశమిచ్చారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారికి ఈనెల 23న సీట్ల కేటాయింపు చేస్తారు. సీటు పొందిన వారు ఈ నెల 23 నుంచి 28 వరకు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అన్ని ఫేజుల్లో సీట్లు పొందిన వారు ఈ నెల 24 నుంచి 28 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూన్ 30 నుంచి సెమిస్టర్-1 క్లాసులను ప్రారంభించనున్నారు. మొదటివిడతలో 89,468 మంది రిజిస్టర్ చేసుకోగా వారిలో 83,119 మంది ఫీజు చెల్లించారు. అందులో 77,012 మంది దరఖాస్తు చేశారు. వారిలో 65,190 మంది వెబ్ ఆప్షన్లను ఇచ్చారు. అందులో 60,428 మందికి సీట్ల కేటాయింపు చేశారు. కాలేజీల్లో సీటు అలాట్ అయిన వారిలో మంగళవారం మధ్యాహ్నం వరకు 41,285 మంది సెల్ఫ్ రిపోరింగ్ చేశారు.
Read also: Thummalanageswar Rao: మంత్రి తుమ్మలను విచారించనున్న జస్టిస్ పిసి ఘోష్?