Telugu News: DCM Bhatti: గ్లోబల్ సమ్మిట్ కు రండి

Read Time:  1 min
DCM Bhatti
DCM Bhatti
FONT SIZE
GET APP

జార్ఖండ్ సిఎం సోరెన్ ను ఆహ్వానించిన డిసిఎం భట్టి

తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8 మరియు 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమ్మిట్‌కు’ (Global Summit) హాజరు కావాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (DCM Bhatti) ప్రత్యేకంగా ఆహ్వానించారు. జార్ఖండ్ సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను డిప్యూటీ సీఎం హేమంత్ సోరెన్‌కు అందించారు.

Read Also: TELANGANA RISING GLOBAL SUMMIT 2025 : సీఎం రేవంత్ పై సోనియా ప్రశంసలు

DCM Bhatti
DCM Bhatti Come to the Global Summit

3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం, విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ

తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా వివరించారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు మరియు అనుసరించాల్సిన భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను’ రూపొందించినట్లు ఆయన తెలిపారు.

నీతి ఆయోగ్ సలహాలు, సూచనలతోపాటు అన్ని రంగాల నిపుణుల మేధోమథనంతో తయారు చేసిన ఈ విజన్ డాక్యుమెంట్‌ను గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జార్ఖండ్ సీఎంకు వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.