📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News:DCC Presidents Selection: రేపు ఏఐసిసి పరిశీలకుల రాక

Author Icon By Pooja
Updated: October 10, 2025 • 11:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి వారి మనోభావాలకు అద్దం పట్టేలా డిసిసి అధ్యక్షుల ఎంపిక(DCC Presidents Selection) చేయడం కోసం ఎఐసిసి నియమించిన పరిశీలకులు తెలంగాణకు శనివారం ఉద యం రాబోతున్నారు. డిసిసి ప్రసిడెంట్ ఎంపికకోసం సెప్టెంబరు 23న అఖిలభారత కాంగ్రెస్కమిటీ సెక్రటరీ కెసి వేణుగోపాల్ 22 మందితో కూడిన పరిశీలకుల జాబితా ప్రకటించారు.

Read Also: Mohammed Kaif: ఆస్ట్రేలియా సిరీస్ .. భారత జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి

తెలంగాణ పరిశీలకులలో వి.నారాయణ స్వామి, సి.పి.జోషి. శక్తి సింగ్ గోహిల్, బెన్నీ బెహానన్, అంటో ఆంటోనీ, హిబి ఈడెన్, స్టారిటా లైట్ ప్లాంగ్, శోభా ఓజా, బి.వి. శ్రీనివాన్, అజయ్ సింగ్, రిజ్వాన్ అర్షద్, టి. సిద్ధిక్, సోఫియా ఫిర్దాస్, శ్రీనివాస్ మానే, అమిన్ పటేల్ ఎం.నారాయణ స్వామిప సారత్ రౌత్, బిస్వరం జన్ మోహంతీ, నబజ్యోతి పట్నాయక్, డెబాసిస్ పట్నా యక్, జాన్సన్ అబ్రహామ్, కె.మహేంద్రన్లతో కూడిన జాతీయ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. శనివారం వారు రాగానే నియామకాల ప్రక్రియ కోసం ఔత్సాహిక నాయకుల పట్ల కాంగ్రెస్ కార్యకర్త మనోభావాలు అంనావేసేకార్యక్రమం ప్రారంభమౌతుంది. క్షేత్ర స్థాయిలో పర్యటించి వారం రోజులలో ఒక సమగ్రమైన నివేదిక ఎఐసిసి కి అందజేస్తారు.

తెలంగాణ రాష్ట్రంతోపాటు ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల ఎంపిక కోసం(DCC Presidents Selection) పరిశీలకుల పేర్లను ఎఐసిసి(AICC) సెప్టెంబరు మూడో వారం ప్రకటించింది. జాతీయ స్థాయిలో సీనియర్ నాయకుల ను పరిశీలకులనియమించినారు. డిసిసిల నియామకాలను ఎఐసిసిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది అందుకే పరిశీలకుల నియామకం జాబితాను కూడా ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గేపేరుతోనే విడుదల చేశారు. ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా నిర్ణయాలు తీసుకోవడానికి ఎఐసిసి సీనియర్ నాయకులను ఇంచార్జ్ లుగా నియమించినారు. ఎఐసిసిమాజీ ముఖ్యమంత్రి, సభ్యులు, మాజీ కేంద్ర మంత్రులు, స్పీకర్ గా పని చేసిన వారిని తెలంగాణ డిసిసిల నియామకాలకు ఇంచార్జ్ లుగా వేయడం జరిగింది. డిసిసి నియామకాలకు ఇస్తున్న ప్రాధాన్యత కు నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. దీంతో డిసిసి నియామకాలు ఎంత పారదర్శకంగా, ప్రతిష్టాత్మకంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా జరుగుతాయో అర్థం చేసుకోవచ్చు.డిసిసి లకు భవిష్యత్ లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వనుండడంతో డిసిసి లకు డిమాండ్ పెరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

AICC Observers congress party DCC Presidents Selection Latest News in Telugu Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.