దావోస్(Davos) లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(Revanth Reddy) వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(WEF) మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, సిఐఆర్ నెట్వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలతో పాటు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సు నిర్వహించే ప్రతిపాదనలను చర్చించారు. ప్రతి ఏడాది జులైలో మతే హైదరాబాద్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఫాలోఅప్ సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు.
Read Also: SIT Notice : సిట్ విచారణను కార్తీకదీపం సీరియల్ తో పోల్చిన కేటీఆర్
హైదరాబాద్లో ఫాలో అప్ ఫోరమ్
జనవరిలో దావోస్లో జరిగే సదన్సులోని చర్చలు, తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షించుకునేందుకు ఫాలో అప్ సమావేశం ఉపయోగపడుతుందన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం భాగస్వామ్యంతో ఫాలో ఆప్ సదస్సు కైన నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న అవకాశాలు, పారిశ్రామిక రంగంలో ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాలు, ప్రభుత్వ విధానాలను ప్రపంచానికి చూపించాలనే ఆలోచనను పంచుకున్నారు. అందుకే హైదరాబాద్లో ఫాలో అప్ ఫోరమ్ నిర్వహించాలలని కోరారు.
ముఖ్యమంత్రి ప్రతిపాదనకు వరల్డ్ ఎకనమిక్ ఫోరం బృందం సానుకూలంగా స్పందించింది. వివిధ దేశాల నుంచి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ.. సమీప భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్ తెలిపారు. చైనాలో ప్రతి ఏడాది సమ్మర్ దావోస్ జరుగుతోందని, సౌదీ అరేబియా కూడా ఆసక్తి ప్రదర్శిస్తోందని చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్మ్యప్, లక్ష్యాలను సీఎం వివరించారు. తెలంగాణ విజన్లోని విభిన్న కోణాలు వివిధ కోణాలు పరస్పర సహకారానికి అవకాశం కల్పించేలా ఉన్నాయని జెరెమీ జర్గెన్స్ ప్రశంసించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో తాము భాగస్వామ్యం పంచుకుంటామన్నారు.
C4IR తెలంగాణ పురోగతిపై సమీక్ష
ఆర్థిక వృద్ధి ప్రయాణంలో కలిసి వస్తామనే సంకేతాలు ఇచ్చారు. హైదరాబాద్లో ప్రతిభావంతమైన వనరులున్నాయని అభిప్రాయపడ్డారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, యంగ్ ఇండియా స్కిల్స్ మానవ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను స్కిల్ డవలప్మెంట్, స్పోర్ట్స్ కు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. హైదరాబాద్లో జరిగిన బయోఏషియా 2024లో ప్రారంభించిన సి4ఐఆర్ తెలంగాణ (సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్) పురోగతిపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ భారత్లో ప్రారంభించిన తొలి థీమాటిక్ సెంటర్ అదేనని గుర్తు చేశారు.
సి4ఐఆర్ ఆదర్శవంతమైన మోడల్గా గుర్తింపు సాధించిందన్నారు. పరిశ్రమల అభివృద్ధి ప్రణాళికలో ఉత్తమ పద్ధతులపై ది4.0 చేస్తున్న పరిశోధనల సమాచారాన్ని తెలంగాణా ప్రభుత్వంతో సంచుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మూడు జోన్ల నమూనాను విశ్లేషించారు. క్యూర్ సెయుఆర్), ప్యూర్(పెయుఆర్ఈ), రేర్(ఆర్ఎఆర్ఎ) ఆర్ధిక అభివృద్ధి వ్యూహంతో పాటు భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటును వివరించారు. ఇది నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుగా, దేశంలో సుస్థిర అభివృద్ధికి రోల్ మోడల్ సిటీగా నిలుస్తుందన్నారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ఏరోస్పేస్, డిఫెన్స్, బయోడిజైన్, సాఫ్ట్వేర్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్కు ఉన్న అనుకూలతలను వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: