हिन्दी | Epaper
లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు

Inter Results : ఇంటర్మీడియట్ ఫ‌లితాల విడుద‌ల‌కు తేదీ ఫిక్స్

Sudheer
Inter Results : ఇంటర్మీడియట్ ఫ‌లితాల విడుద‌ల‌కు తేదీ ఫిక్స్

తెలంగాణలో ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు ఇంటర్ బోర్డు తుది సమయాన్ని ఖరారు చేసింది. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా ఫలితాలను నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యతో పాటు పలువురు అధికారులు హాజరుకానున్నారు.

సుమారు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు

ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 1532 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. Inter Results : ఇంటర్మీడియట్ ఫ‌లితాల విడుద‌ల‌కు తేదీ ఫిక్స్ అయింది అని ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఫలితాల కోసం వేచి చూస్తున్న విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు స్పాట్ వాల్యుయేషన్‌ను మార్చి 18 నుంచి 19 కేంద్రాల్లో ప్రారంభించి, నిర్ణీత సమయానికి ఫలితాలు విడుదల చేసేలా వేగంగా ఏర్పాట్లు చేసింది. తొలిసారిగా రాండమ్ రీవాల్యుయేషన్ కూడా నిర్వహించి, పాస్ మార్కుల దగ్గరలో ఉన్న పేపర్లు మళ్లీ పరిశీలించడం ద్వారా విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూసింది.

 ఇంటర్మీడియట్ ఫ‌లితాల విడుద‌ల‌కు తేదీ ఫిక్స్

ఫలితాలను విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్లలలో చూడొచ్చు

Inter Results : ఇంటర్మీడియట్ ఫ‌లితాల విడుద‌ల‌కు తేదీ ఫిక్స్, ఫలితాలను విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్లు tsbie.cgg.gov.in, results.cgg.gov.in లేదా టీవీ9 వెబ్‌సైట్ ద్వారా కూడా చూసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ ఉపయోగించి రిజల్ట్స్ చెక్ చేయవచ్చు. ఫలితాల విడుదల తర్వాత రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌కు కూడా అవకాశం ఇవ్వనున్నారు. అలాగే, ఒక నెల వ్యవధిలోనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు సైతం ప్లాన్‌ చేస్తోంది బోర్డు. Inter Results : జనాలు ఇంటర్మీడియట్ ఫ‌లితాల విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫలితాలు విద్యార్థుల భవిష్యత్‌కు కీలకంగా ఉండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870