📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Dasoju Shravan : రేవంత్ రెడ్డి వైఖరిపై విమర్శలు : దాసోజు శ్రవణ్

Author Icon By Divya Vani M
Updated: April 2, 2025 • 8:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తాజా రాజకీయ పరిణామాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఓ జింకను చంపినందుకు ఐదేళ్ల జైలు శిక్షకు గురికాగా, వందల నెమళ్లు, జింకలను చంపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంత శిక్ష పడాలని ప్రశ్నించారు.బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) మరియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థులతో కలిసి దాసోజు శ్రవణ్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి భూముల పరిరక్షణ కోసం విజ్ఞప్తి చేశారు.

Dasoju Shravan రేవంత్ రెడ్డి వైఖరిపై విమర్శలు దాసోజు శ్రవణ్

కంచ గచ్చిబౌలిలోని విశ్వవిద్యాలయ భూములు రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో పడకుండా చూడాలని కోరారు.ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన దాసోజు శ్రవణ్, “హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు వాడేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అణచివేత విధానాన్ని అవలంబిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు, అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ నేతలు, విద్యార్థుల డెలిగేషన్‌తో కలిసి కేంద్ర మంత్రిని కలిసినట్టు దాసోజు శ్రవణ్ తెలిపారు. “మేము భూముల పరిరక్షణ కోసం పోరాటం చేస్తాం. సుప్రీంకోర్టు ద్వారా హెచ్‌సీయూ భూముల పై అధికారాన్ని పొందగానే ప్రభుత్వం వాటిని తాకట్టు పెట్టి రూ. 20 వేల కోట్లు అప్పు తెచ్చింది. ఇది విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేసే చర్య,” అని ఆరోపించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తప్పుబడుతూ, “రాజకీయ లబ్ధి కోసం విద్యార్థుల హక్కులను తాకట్టు పెట్టే ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు, యువత కలిసి ఉద్యమించకపోతే నష్టపోయేది మన భవిష్యత్ తరాలు,” అని హెచ్చరించారు.

brs DasojuShravan HCU HyderabadPolitics PoliticalNews RealEstateScam RevanthReddy TelanganaNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.