📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Damodara Rajanarsimha: కొత్త టిమ్స్ హాస్పిటళ్లలో ఆధునిక సాంకేతిక పరికరాలు కొనాలి – మంత్రి దామోదర రాజనర్సింహ

Author Icon By Sharanya
Updated: July 8, 2025 • 12:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న టిమ్స్ హాస్పిటల్స్ తోపాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అత్యాధునిక టెక్నాలజీ ఉన్న మెడికల్, డయాగ్నస్టిక్స్ ఎక్విప్మెంట్ను (Diagnostics Equipment) కొనుగోలు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) ఆదేశించారు. డాక్టర్లు. సిబ్బంది, పేషంట్ల అవసరాలకు అనుగుణంగా ఫర్నీ చరు కొనుగోలు చేయాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్ కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. టిజిఎంఎస్ ఐడిసిపై మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) సమీక్ష నిర్వహించారు.

తగిన ఫర్నీచర్, ఎక్విప్మెంట్ సరిపడా ఉండాలి

ఈ మంత్రి మాట్లాడుతూ.. కార్పొరేట్ సందర్బంగా హాస్పిటల్స్ వినియోగిస్తున్న ఎక్విప్మెంట్ ఏమిటో డాక్టర్లను అడిగి తెలుసు కోవాలన్నారు. డాక్టర్లు, సిబ్బంది, పేషెంట్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫర్నీచర్ కొనుగోలు చేయాలన్నారు. కొత్త హాస్పిటళ్లకు పేషెంట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని, ఆ అంచనాలకు తగ్గట్టుగా ఫర్నీచర్, ఎక్విప్మెంట్ సరిపడా ఉండాలన్నారు. కొనే ప్రతి వస్తువుకూ వారంటీ ఉండాలని, మెయింటనెన్స్ విషయంలో సప్లయర్లను వాధ్యులుగా చేయాలన్నారు. ఒక్క వస్తువు కూడా రిపేర్, నిరుపయోగంగా ఉండే ఉండకూడదన్నారు. ప్రభుత్వ దవాఖానలో మెడిసిన్ సరఫరాపై వివిధ విభాగాల హెచ్వోడీ లను మంత్రి వివరాలు అడిగారు. అవసరమైన అన్ని మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా? లేవా అని డీఎంఈ, వైద్యవిధాన పరిషత్ కమిషనర్, డైరక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్డ్ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధుల కాలం కావడంతో పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని, అందుకు అనుగుణంగా మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి ఆదేశించారు. సెంట్రల్ మెడిసినల్ స్టోర్లలో కనీసం 3 నెలలకు సరిపడా మెడిసిన్ అందుబాటులో (Access to medicine) ఉంచుకోవాలని టిజిఎం ఎస్ఐడిసి అధికారులకు మంత్రి సూచించారు.

ప్రతి పీహెచ్సీలోనూ టెస్టులు

ప్రతి పీహెచ్సీలోనూ టెస్టులు అవసరమైన పేషెంట్ల నుంచి సాంపిల్స్ సేకరించాలని, 24 గంటల లోపల రిపోర్టులు అందజేయాలని మంత్రి ఆదేశించారు. గతేడాది కొత్తగా ప్రతి జిల్లాలోనూ మెడిసినల్ స్టోర్లను ఏర్పాటు చేశామని, ఆయా స్టోర్లకు పర్మినెంట్ బిల్డింగ్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అన్ని జిల్లాల్లో బిల్డింగుల నిర్మాణాన్ని ప్రారంభించి, త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. మెడికల్ కాలేజీలు అన్నింటిలోనూ సీటీ స్కాన్ మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, అలాగే అవసరమైన చోట ఎంఆరఐ యంత్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించామని మంత్రి తెలిపారు.
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు వెల్నెస్ సెంటర్లలో ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ తోపాటు ఇతర ఉన్నతాధి కారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. వెల్నెస్ సెంటర్లపై వస్తున్న వార్తల విషయంలో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసు కోవాలని అధికారులను ఆదేశించారు .


దామోదర రాజనరసింహ ఎవరు?

కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడైన రాజనర్సింహ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2023 డిసెంబరు 07న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Dost – 2025: దోస్త్ – 2025లో 1.43 లక్షల మంది ప్రవేశాలు

Breaking News Damodara Rajanarsimha latest news Medical Facilities Telangana Telangana Health Minister Telugu News TIMS Hospitals Telangana TIMS Modernization

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.