📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: D.C.M. Bhatti: సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఢిల్లీకి రావడానికి సిద్ధం

Author Icon By Pooja
Updated: November 28, 2025 • 10:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : వెనుకబడిన తరగతులకు 42శాతం రిజర్వేషన్ అంశం రాజ్యాంగంలోని 9 షెడ్యూల్లో చేర్చాలని విన్నవించు కోవాడనికి ప్రధానమంత్రి సమయం ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామనీ తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. గురువారం ప్రజాభవన్లో పార్లమెంట్లో ప్రస్తావిం చాల్సిన అంశాలపై రాష్ట్ర పార్లమెంట్ సభ్యులతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్ర మార్కమల్లు(D.C.M. Bhatti) సమావేశమైనారు. పార్లమెంటులో ప్రస్తావించా ల్సిన 12శాఖలకు చెందిన 47 అంశాలను పవర్పాయింట్ ప్రజం టేషన్ ఎంపిలకు వివరించారు. ఉపముఖ్యమంత్రి మాట్లాడు తూ బిసిలకు సంబంధించిన 42శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం తొమ్మిదవ షెడ్యూల్లో సవరణ కోసం నిర్దేశిత ఫార్మేట్లో వాయిదా తీర్మానం లేదా ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు తీసుకొని రావాలని ఆయన కోరారు.

Read Also: Nara Lokesh: భారత్ డేటా రాజధానిగా విశాఖ

D.C.M. Bhatti: Ready to come to Delhi under the leadership of CM Revanth Reddy

ప్రధానమంత్రిని కలిసి అన్ని పార్టీలఎంపిలు ఒక వినతి పత్రాన్ని ఇవ్వండని సూచించారు. బిసిల రిజర్వేషన్కు సంబం ధించి రాష్ట్రంలో ఎపిక్ సర్వే జరిగింది, ఎంపిరికల్ డాటా ఆధారంగా అసెంబ్లీలో బిసిల రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టగా పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఆమో దించారనే విషయం పార్లమెంటులో వినిపించాలని ఆయన కోరారు. బిల్లు గవర్నర్ నుంచి కేంద్రానికి వెళ్లి అక్కడ పెండింగ్లో ఉందని గుర్తుచేయాలని తెలి పారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూ లంగా పార్లమెంట్ సభ్యులు అందరూ పార్టీలకు అతీతంగా ఒక బృందంగా ఏర్పడి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను విజప్తులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సూచించారని ఆయన తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపిలు అడిగిన సమాచారం నిమిషాల్లో లేదా గంటల్లో అందించేందుకు ఢిల్లీలో ప్రణాళిక ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంపిలు వినియోగించుకోవాలని కోరారు.

అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రభుత్వ శాఖలు ఏ విధంగా పూర్తి సంసిద్ధంగా ఉంటాయో అదే విధంగా పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉండి సమా చారం అందించేందుకు ఏర్పాటు చేశాము. ఎవరైనా రాష్ట్రానికి సంబంధించిన ఎంపిలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో ప్రశ్నించడం, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు ఇవ్వాలనుకుంటే విషయాన్ని వివరిస్తే చాలు నిర్దేశిత ఫార్మాట్లో సమాచారాన్ని, విజ్ఞాపన పత్రాలను ఢిల్లీలోని రాష్ట్ర అధికారులు ఎంపిలకు అందిస్తారు. నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ, జిఎస్టి తదితర విషయాలకు సంబంధించి కేంద్ర నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులు, పథకాల కు సంబంధించి గతంలో లేఖలు రాశాం ఆలేఖలు ఢిల్లీలోని ప్రత్యేక విభాగంలో ఎంపి లకు అందుబాటులో ఉంటాయి. వాటి ఆధారంగా ఎంపిలు ఫాలో అప్ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 9 నాటికి ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండు. సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా. సాధించిన విజయాల వివరించడంతోపాటు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించి 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ చేయబోతున్నాం.

ఈ కార్యక్రమం విజయవంతానికి కమిటీలు వేస్తున్నాం. కేంద్ర మంత్రులను, ఎంపి లందరినీ ఆహ్వానించాలని భావిస్తున్నామని వివరించారు. ఇంట్రెస్ట్ ఉన్న ఎంపిలు పేర్లు ఇస్తే కమిటీలు సభ్యులుగా నమోదు చేస్తామని తెలిపారు. దేశంలో, ప్రపంచంలో ప్రముఖ వ్యక్తులు, సంస్థలతో ఎంపిలు ఎవరికైనా పరిచయం ఉంటే వివరాలు ఇవ్వండని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వారిని 1 గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానిస్తామని తెలిపారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్స్, ఇతర సమస్యలపై ప్రధానమంత్రి సమయం తీసుకుని సమిష్టిగా కలుద్దామని సమావేశంలో చెప్పారు. అంతేకాక ఆదిలాబాద్ పటాన్ చెరు రైల్వే లైన్ పై సాధ్యాసాధ్యాలు, డిపిఆర్ ఏమైనా చేశారా అని అడిగారు. రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ అలాట్ మెంట్ గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తే.. సంబంధిత మంత్రిని పార్టీలకు అతీతంగా కలసి లేఖ ఇద్దామని ప్రతిపాదించారు.

మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రతిపాదించిన విషయం అత్యంత ఆహ్వానించదగ్గదని నాగర్ కర్నూల్ ఎంపి మల్లు రవి చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్, ఇతర రహదారులు, పెండింగ్ అంశాలపై అఖిలపక్ష సభ్యులంతా కలిసి నేరుగా ప్రధానమంత్రికి లేఖ ఇద్దామని మల్లు రవి చెప్పారు. మహబూబ్ నగర్ ఎయిర్ పోర్ట్ పై పూర్తి సమాచారంకు సంబంధించి కేంద్రానికి ඒන రాయాలన్నారు. గద్వాల డోర్నకల్ రైల్యే లైన్ సర్వేపైనా సమాచారాన్ని ఆయన కోరారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే బ్యాక్ వాటర్ వల్ల తమ నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని మహబూబాబాద్ ఎంపి బలరామ్ నాయక్ చెప్పారు. ప్రాజెక్ట్ లో నీరు నింపితే వచ్చే బ్యాక్ వాటర్ ముంపు వల్ల లక్షమందికి పైగా ముంపు బారిన పడే అవకాశం ఉందని చెప్పారు.

ఈ సమస్యపైనా పరిష్కారం కావాలని చెప్పారు. ములుగు ఏటూరు నాగారం రహదారిని కేంద్రం మంజూరు చేసినా ఇప్పటికి టెండర్ తగుతున్నాయని ఖరారు కాలేదని చెప్పారు. రాష్ట్రంలో ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ కార్యక్రమంలో పని దినాలు బాగా జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ చెప్పారు. పని దినాలు తగ్గడం వల్ల పేదలకు ఉపాధి లేకుండా పోవడంతో పాటు.. గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోతాయని అన్నారు. అంతేకాక మా లోక్ సభ పరిధిలో జహీరాబాద్ బీదర్ రహదారి అత్యంత కీలకమైంది. దీనిపై కేంద్రానికి లేఖ రాయడంతో పాటు, పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావన తీసుకురావాలని అన్నారు. అదిలాబాద్ విమా నాశ్రయ నిర్మాణం కోసం 800 ఎకరాలు అవసరం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ కు లేఖ రాశా రనీ, ఆదిలాబాద్ ఎంపి గోడెం నగేష్ చెప్పారు. ఇప్పటికే అక్కడ 369 ఎకరాలు ఉన్నాయి.

ప్రభుత్వం పేర్కొన్న 700 ఎకరాల్లో ఈ 369 ఎకరాలు అంతర్భగామేనా? లేక 700 ఎకరాలు అదనంగా సేకరిస్తున్నారా? అని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వ అధికారులు స్పందిస్తూఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధిత అధికారులు ఇతర అవసరాలకు మొత్తంగా వెయ్యి ఎకరాలు అవసరం అవుతాయని లేఖ రాశారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఉన్న 369 ఎకరాలకు అదనంగా మరో 700 ఎకరాల భూ సేకరణ చేయాలని చెప్పారు. వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకోసంఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా? అని ఎంపీ కడియం కావ్య అడిగారు. వీటితో పాటు సెమీ కండక్టర్లకు సంబంధించిన అంశం సమా వేశంలో(D.C.M. Bhatti) చర్చకు వచ్చింది. కాంగ్రెస్ ఎంపిలుమల్లు రవి,బల రాం నాయక్, సురేష్ షెట్కార్, చామల కిరణ్,రామస హాయం రఘురామ్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, అనిల్ కుమార్ యాదవ్, బిజెపి ఎంపీ రఘునందన్ రావు నగేష్లు సీఎస్ రామకృష్ణ రావు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

congress party Delhi meeting Google News in Telugu Latest News in Telugu Revanth Reddy Telangana politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.