నూతన సంవత్సరానికి సైబరాబాద్ పోలీసుల ప్రత్యేక ప్లాన్
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరవాసుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సైబరాబాద్ పోలీసు(Cyberabad Police) శాఖ కఠిన చర్యలను ప్రకటించింది. వేడుకల పేరుతో చట్టాలను ఉల్లంఘించిన వారిపై ఎలాంటి సడలింపులు ఉండవని సోమవారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ముఖ్యంగా క్యాబ్, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించింది.
Read Also: TTD: తిరుమల చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి…
ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు
యాప్‌ల ద్వారా బుక్ చేసిన రైడ్‌లను డ్రైవర్లు తిరస్కరించకూడదని, అలా చేసినట్లయితే ఈ-చలాన్ల ద్వారా భారీ జరిమానాలు విధిస్తామని పోలీసులు తెలిపారు. వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా యూనిఫామ్ ధరించడంతో పాటు అవసరమైన పత్రాలన్నీ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించినా, అదనపు చార్జీలు వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లపై వాహనం నంబర్, సమయం, ప్రదేశం వివరాలతో 9490617346 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.
మద్యం సేవించిన వారు వాహనాలు నడపకుండా చూడాల్సిన బాధ్యత బార్‌లు, పబ్‌లు, క్లబ్‌ల యాజమాన్యాలపై ఉందని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న కస్టమర్లు పట్టుబడితే సంబంధిత సంస్థలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డిసెంబర్ 31 సాయంత్రం 8 గంటల నుంచే సైబరాబాద్ పరిధి అంతటా డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and drive) తనిఖీలు విస్తృతంగా చేపట్టనున్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, అతివేగం, సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలను గుర్తించేందుకు ప్రధాన రహదారులపై ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా, సురక్షితంగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని పోలీసులు ప్రజలను కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: