📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య

Cyber Crime: ఇన్వెస్ట్‌మెంట్ లింకులు వస్తే అప్రమత్తంగా ఉండండి

Author Icon By Saritha
Updated: December 23, 2025 • 4:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టెలిగ్రామ్, వాట్సాప్ సోషల్ మీడియా(Social media) గ్రూపులు లేదా (Cyber Crime) ఆన్‌లైన్ ద్వారా వచ్చే ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. క్రిప్టో కరెన్సీ, ఫారెక్స్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో అధిక లాభాలు లేదా గ్యారెంటీ రిటర్న్స్ ఇస్తామని చెప్పి సైబర్ నేరగాళ్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. బాధితులను ఆకర్షించి, నకిలీ వెబ్‌సైట్లు, యాప్స్, ట్రేడింగ్ డాష్‌బోర్డుల ద్వారా లాభాలు వచ్చినట్లు చూపించి మరింత పెట్టుబడి పెట్టేలా మభ్యపెడుతున్నారని వివరించారు.

ఇలాంటి మోసాలపై హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగం ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. వాట్సాప్ ఆధారిత పెట్టుబడి మోసంలో ఒక మాజీ పోలీసు అధికారి భారీగా నష్టపోయిన ఘటనను పోలీసులు ఉదాహరణగా పేర్కొన్నారు. పంజాబ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అమర్ సింగ్ చాహల్ ఈ తరహా మోసంలో చిక్కుకుని రూ.8 కోట్లకు పైగా నష్టపోయారని వెల్లడించారు. ఈ ఘటన సైబర్ మోసాలు ఎంతటి తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తాయో తెలియజేస్తుందని పోలీసులు తెలిపారు.

Read Also: Bengaluru: దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్

మోసగాళ్ల పని తీరేంటి అంటే

సోషల్ మీడియా ద్వారా పెట్టుబడి సలహాదారులమని చెప్పుకుంటూ ముందుగా సందేశాలు పంపిస్తారు. (Cyber Crime)మొదట తక్కువ మొత్తంతో పెట్టుబడి పెట్టించి, లాభాలు వచ్చినట్లు చూపిస్తూ నమ్మకం పెంచుతారు. నిత్యం లాభాలు కనిపించేలా నకిలీ ప్లాట్‌ఫాంలను ఉపయోగించి నిజమైన ట్రేడింగ్ జరుగుతున్నట్టు భ్రమ కలిగిస్తారు. తర్వాత ఎక్కువ పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి తెస్తారు. బాధితుడు డబ్బులు వెనక్కి తీసుకోవాలని అడిగినప్పుడు పన్నులు, కన్వర్షన్ ఫీజులు, ఉపసంహరణ ఛార్జీలు, కంప్లయెన్స్ పేరుతో అదనపు చెల్లింపులు కోరుతారు. ప్రతి సారి చెల్లించిన తర్వాత కొత్త కారణం చెప్పి మరిన్ని డబ్బులు వసూలు చేస్తారు.

అనుమానం వ్యక్తమైతే ఖాతా ఫ్రీజ్ అవుతుందని లేదా చట్టపరమైన చర్యలు ఉంటాయని బెదిరింపులకు పాల్పడతారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే పెట్టుబడి ఆఫర్లు, లింకులను నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. పెట్టుబడి సలహాదారులు నిజంగా సెబీ (SEBI) వద్ద నమోదు అయి ఉన్నారా లేదా తప్పనిసరిగా పరిశీలించాలని, తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే మాటలను విశ్వసించకూడదని హెచ్చరించారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ లేదా సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Cyber Crime cyber security Financial Awareness Investment Scam Latest News in Telugu Online Fraud social media scams Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.