📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Cyber Crime: డాక్టర్ ను రూ.14.61 కోట్లు బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు

Author Icon By Sushmitha
Updated: November 29, 2025 • 1:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సైబర్ నేరాలపై పోలీసులు ఎన్నో హెచ్చరికలు జారీ చేస్తున్నా ఆ దోపీడి ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒకచోటు సైబర్ నేరగాళ్లు (Cyber Crime) అందినకాడికి దోచుకుంటున్నారు. వీరి మోసల ఊబిలో చిక్కుకుంటున్నవారు సమాజంలో ఉన్నతపదవుల్లో ఉన్న బడానాయకులే. ఉన్నతస్థాయి పదవుల్లో ఉన్న విద్యాధికులే కావడం విశేషం. తాజాగా సైబర్ మోసగాళ్లకు చిక్కిన ఓ వైద్యుడు భారీమొత్తంలో డబ్బును పోగొట్టుకున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నకిలీ పెట్టుబడుల పేరిట జరిగిన మోసంలో తాజాగా ఓ వైద్యుడు ఏకంగా రూ.14.61 కోట్లు పోగొట్టుకున్నారు. 

Read Also: Deeksha Divas: KCR ఆమరణ దీక్షతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి

రాష్ట్ర చరిత్రలో ఒకే సైబర్ మోసంలో ఇంత పెద్దమొత్తం పోగొట్టుకున్న ఉదంతం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తెలంగాణ (Telangana) సైబర్ సెక్యూరిటీ బ్యూరో నమోదు చేసిన కేసులోని వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్ నగర్ కు చెందిన వైద్యుడిని గత ఆగస్టు 27న ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా మోనికా మాధవన్ అనే పేరుతో ఓ మహిళ సంప్రదించింది. పెళ్లి పేరుతో మోసపోయానని తన విడాకుల కేసు పెండింగ్ లో ఉందని గోడు వెళ్లబోసుకుంది. అలా కొన్ని సంభాషణల అనంతరం టెలిగ్రామ్ ఐడీ ద్వారా సంప్రదింపులు జరుపుదామని ప్రతిపాదించింది. వైద్యుడు అందుకు సమ్మతించడంతో సంభాషణల పర్వం కొనసాగింది.

Cyber ​​criminals duped doctor of Rs. 14.61 crore

అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టిన వైద్యుడు

తనకు షేర్ ట్రేడింగ్ లో ఐదేళ్లకు పైగా అనుభవముందని చెప్పింది. సీఎంసీ మార్కెట్లలో రోజూ రూ. 4-5 లక్షల మేర సంపాదిస్తున్నానని పేర్కొంది. తనలా ట్రేడింగ్ చేసేందుకు పేరు రిజిస్టర్ చేసుకోవాలని వెబ్ సైట్ లింక్ పంపించింది. అనంతరం రూ.30లక్షలు పట్టుబడి పెట్టాలంటూ సెప్టెంబరు 30న వైద్యుడిని ఒప్పించింది. మొదటి ట్రేడ్ లోనే రూ.8.6 లక్షల లాభమొచ్చినట్లు వైద్యుడి వర్చువల్ ఖాతాలో కనిపించింది. దీంతో రూ.10కోట్ల మేర పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేసింది. ఈ క్రమంలో వైద్యుడు తన ఖాతా నుంచి రూ.85 వేలు ఉపసంహరించుకునే అవకాశం కల్పించింది. దీంతో నమ్మకం కుదిరిన వైద్యుడు బ్యాంకు రుణాలతోపాటు స్నేహితుల వద్ద అప్పులు చేసి సుమారు రూ. 14 కోట్ల మేర పెట్టుబడి ఎపెట్టారు. అప్పుడు అతడి వర్చువల్ ఖాతాలో రూ. 34 కోట్ల మేర నగదు నిల్వ ఉన్నట్లు చూపించింది. వాటిని ఉపసంహరించేందుకు ప్రయత్నించగా పన్ను కింద రూ.7.5 కోట్లు చెల్లించాలని చెప్పింది. 

అందుకు వైద్యుడు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తన వాటాగా 50శాతం పన్నును యూఎస్ఓటీ రూపంలో చెల్లిస్తానని, మిగిలిన రూ.3.75 కోట్లను చెల్లించాలని వైద్యుడికి మోనికా స్పష్టం చేసింది. ఆపై సీఎంసీ ప్రతినిధులు పంపించిన డాక్యుమెంట్లు అసంబద్ధంగా ఉండడంతో వైద్యుడికి అనుమానమొచ్చింది. గట్టిగా నిలదీయంతో మోనికా స్పందించడం మానేసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేశారు. ముక్కుమొహం తెలియకుండా కేవలం ఆన్లైన్ పరిచయాల ద్వారా భారీగా పెట్టుబడి పెట్టేవారు ఒకసారి అన్నివిధాలుగా ఎక్వైరీ చేసుకుని, మరి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు, మన కష్టార్జితం క్షణాల్లో సైబర్ నేరగాళ్ల వసం అవుతున్నది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

14.61 crore scam Cyber Crime cyber security. doctor defrauded Financial Crime Google News in Telugu Latest News in Telugu Online Fraud Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.