📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Cultural Movement : బిసిల సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం

Author Icon By Shravan
Updated: July 29, 2025 • 11:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ : ప్రపంచ చరిత్రలో సాంస్కృతిక ఉద్యమం లేకుండా ఏఉద్యమం విజయవంతం కాలేదని, నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి నేటి తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం వరకు కవులు కళాకారులు రచయితలు సాంస్కృతిక సేనగా ఏర్పడి ఉద్యమిస్తేనే ఉద్యమాలు విజయం సాధించాయని, ఇప్పుడు తెలంగాణలో (Telangana) జరిగే బీసీల రాజకీయ పోరాటానికి సాంస్కృతిక ఉద్యమం తోడు అయితే ఇక వచ్చేది బీసీల రాజ్యమేనని ఇది ఎవరు ఆపలేరని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ అన్నారు. ఈమేరకు సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో “బీసీ కళాకారుల ఆత్మీయ కలయిక “ పేరుతో విసృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు, ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కవులు కళాకారులు తరలివచ్చి .. బిసి కల్చరల్ ఫోరం.. వేదికను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జాజుల శ్రీనివాస్ గౌడ్తో పాటు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్ అనిల్, మహాత్మ జ్యోతిబాపూలే ఈ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవులు పాల్గొన్నారు. సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ (Srinivas goud) మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్రంలోని బిసి కళాకారులు కవులు సామాజిక దోపిడీ అసమాన తలపై, అలాగే ప్రాంతీయ వివక్ష పై తమ కలం ద్వారా, గలం ద్వారా పోరాడారని దీనితో తెలంగాణలో సామాజిక రాజకీయ చైతన్యంతో పాటు ప్రత్యేక రాష్ట్ర సాధన కూడా జరిగిందని, ఇప్పుడు తెలంగాణలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై, అలాగే బీసీలకు రాజకీయ అధికారంకి కవులు కళాకారులు తమ కళాలను గలాలను ఓటు ఓటు చైతన్యంతో బీసీలను రాజకీయ చైతన్యంగా మార్చి రేపటి బీసీల రాజకీయ అధికారానికి బాటలు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్ అనిల్ కుమార్ మాట్లాడుతూ బీసీ కళాకారులు ఏకం కావడం చాలా అభినందనీ య మని, దేశ వ్యాప్తంగా కూడా బీసీల వాణి బలంగా వినపడుతున్న ఈ క్రమంలో దీనికి తోడు బీసీ కళాకారులు ఒక్కటే తమ రచనల ద్వారా పాటల ద్వారా ధూంధాంల ద్వారా బీసీల రాజకీయ చైత న్యాన్ని రగిలించాలని పిలుపునిచ్చారు.

Read Hindi News : hindi.vaartha.com

Read also : New York : మాన్‌హట్టన్ లో మాస్ షూటింగ్ – నలుగురు మృతి


BC Welfare Association Breaking News in Telugu Jajula Srinivas Latest News in Telugu Telangana Cultural Movement Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.