📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

CSEAM: సిఎస్ఇఎఎం టిజైన్ కేసుల విచారణాధికారులకు శిక్షణ

Author Icon By Anusha
Updated: August 9, 2025 • 12:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : బాలలపై జరిగే లైంగిక వేధింపులు, లైంగిక దాడుల కేసులతో పాటు బూతు బొమ్మలతో బాలలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలపై నమోదయ్యే కేసులను విచారించే సిఎస్ఇఎఎం (చైల్డ్ సెక్సువల్ ఎక్స్ ప్లోయిటేషన్ అండ్ అబ్యూస్ మెటీరియల్) విచారణాధికారులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టిజిసిఎస్బి) నిర్వహించిన వారం రోజుల శిక్షణ ముగిసింది. కమాండ్ కంట్రోల్లోని టిజిసిఎ సిబి కార్యాలయంలో గల సైబర్ అకాడమిలో ఈ నెల ఒకటవ తేదీన మొదలైన ఈ శిక్షణ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన ముగింపు కార్యక్రమంలో టిజిసిఎస్బి డైరక్టర్ శిఖాగోయల్ (TGCSB Director Shikha Goyal) మాట్లాడుతూ ఈ శిక్షణలో టిజిసిఎస్బితో పాటు ఇండియన్ చైల్డ్ ప్రొటెక్షన్ కలిసి నిర్వహించాయని, శిక్షణలో భాగంగా విచారణాధికారులకు అనేక అంశాలపై తర్ఫీదు ఇచ్చామని తెలిపారు.

CSEAM: 

సైబర్ టిప్టాన్ నివేదికల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో

అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ప్లోయిటెడ్ చిల్డ్రన్ అనే సంస్థ నుంచి వచ్చే సైబర్ టిప్టాన్ నివేదికల (Cyber ​​Tipton reports) సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, కేసుల క్లిష్టత దృష్ట్యా శిక్షణ నిర్వహించామని ఆమె తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణ పోలీసు విభాగం 561 టిజైన్ల ఆధారంగా 510 ఎఫ్ ఐఆర్లను నమోదు చేసిందని ఆమె వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 పోలీసు విభాగాలకు చెందిన 151 మంది విచారణాధికారులు శిక్షణలో పాల్గొన్నారని, శిక్షణలో భాగంగా 204 సైబర్ టిప్రోన్ ఫైళ్లన సమీక్షించి కేసుల నిర్వహణపై అనుభవం పొందారని ఆమె తెలిపారు. దీంతో పాటు ఈ శిక్షణలో చట్టపరమైన మాడ్యూళ్లు. ఒసిన్ట్, ఫోరెన్సిక్ టూల్స్, సెర్చ్ అండ్ సిజ్ పద్ధతులు, సోషల్ మీడియా ట్రేసింగ్, అసెస్మెంట్ అండ్ ఫీడ్ బ్యాక్ అంశాలపైనా వీరికి నిపుణులైన వా చేత తర్ఫీదును ఇప్పించామని శిఖా గోయల్ తెలిపారు. బాలల రక్షణ, సైబర్ నేరాల నివా ణకు టిజిసిఎస్బి చేబడుతున్న నిరంతర కృషిలో ఇది ఒక భాగమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అంటే ఏమిటి?

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (Telangana Cyber Security Bureau) అనేది రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టడం, సైబర్ భద్రతను మెరుగుపరచడం, సైబర్ మోసాలు, హ్యాకింగ్, డేటా లీకులు వంటి సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం.

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/supreme-court-pay-rs-1-75-lakh-crore-to-discoms/national/528138/

 

child abuse investigation child sexual exploitation CSEAM cases Indian Child Protection Shikha Goyal Telangana Cyber Security Bureau Telugu News TGCSB training

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.