📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Ramakrishna Rao: కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలి- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు

Author Icon By Sharanya
Updated: June 25, 2025 • 11:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: ప్రజల జీవితాల్లో శాశ్వత ప్రభావం చూపేలా కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు (Ramakrishna Rao) కలెక్టర్లను కోరారు. పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి కలెక్టర్లు తమ జిల్లాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడానికి అపారమైన అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇకపై ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు.

జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వన మహోత్సవం, ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం, ఎరువుల లభ్యత, ఆయిల్ పామ్ విస్తరణ, భూ భారతి, సీజనల్ వ్యాధులు టిబి ముక్త్ భారత్, వైద్య కళాశాలల అవసరాలు మొదలైన వాటి పురోగతిని సమీక్షిoచారు. రెవెన్యూ, గృహనిర్మాణం, ఆరోగ్యం, వ్యవసాయం, అటవీ శాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్సు హాజరయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని సమీక్షి ంచి, మంజూరు ప్రక్రియను జారీ చేయాలని కలెక్టర్లను ప్రధాన కార్యదర్శి కోరారు. మంజూరు చేయబడిన అన్ని ఇళ్ల పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వనమహోత్సవం సందర్భంగా, జిల్లా పర్యవేక్షణ సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని, సంబంధిత విభాగాలతో జిల్లాలో సమర్థవంతంగా సమీక్షి ంచా లని కలెక్టర్లకు సూచించారు. వనమహోత్సవంలో మంచి నాణ్యత గల మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయా లేదా అనే విషయాలను నిర్ధారించుకోవాల్సిన అవసరాన్ని ఆయన తెలిపారు. ముఖ్యంగా పండ్ల మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని, మొక్కల మనుగడను పరిశీలించాలని కలెక్టర్లకు సూచించారు. పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్ని విభాగాలను కలుపుకుని మొక్కల పెంపకం చేపట్టడానికి లక్ష విధానాన్ని సూచించారని, జిల్లాల్లో ఖాళీగా ఉన్న భూములను గుర్తించి పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టాలని అన్నారు.

వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ, తగినంత పరిమాణంలో ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రత్యేక అధికారులు తమ జిల్లాల్లోని ఎరువుల షాపులను సందర్శించి పరిస్థితిని సమీక్షి ంచాలని ఆయన అన్నారు. ఆయిల్ పామ్ విషయంలో, ఆయిల్ పామ్ తోటల పెంపకాన్ని చేపట్టడానికి వారి జిల్లాల్లో పెద్ద ప్రాంతాలను గుర్తించాలని అలాగే రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్లను కోరారు. రాష్ట్రవ్యా ప్తంగా జరిగిన రెవెన్యూ సదస్సులో 8 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని ప్రధాన కార్యదర్శి తెలియజేశారు. దరఖాస్తులను వ్యక్తిగతంగా పర్యవేక్షి ంచి, మానవీయ దృక్పథంతో వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆయన సూచించారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో వ్యాపించే వ్యాధులపై కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సిఎస్ కోరారు. టిబి ముక్త్ భారత్ అభియాన్పై, జిల్లా కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని, డిఎంహెచ్లు, హాస్పిటల్ సూపరింటెండెంట్లు, రెడ్ క్రాస్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్లతో కూడిన కన్వర్జెన్స్ సమావేశాన్ని కూడా నిర్వహిం చాలని జిల్లా కలెక్టర్లను సూచించారు. ముఖ్యంగా వైద్య కళాశాలల అవసరాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి నదీమ్ అహ్మద్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చంగ్దూ, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్, పిసిసిఎఫ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read also: Hydra: రహదారులు నీటమునగకుండా అన్ని శాఖలతో సమన్వయం: హైడ్రా కమిషనర్ ఎ.వి రంగనాథ్

#AdministrativeReforms #CSRamakrishnaRao #DistrictCollectors #GoodGovernance #GovernmentLeadership #InnovativeGovernance #telangana Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.