కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను కుదిపేసింది. భార్యపై భర్త అనుమానం, నిరంతర వేధింపులు చివరికి ఒక ప్రాణాన్ని బలితీసుకున్నాయి. సెల్ఫీ వీడియో (Selfie video) లో చివరి మాటలు రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన శ్రావ్య కథ అందరినీ కంటతడి పెట్టిస్తోంది.సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చెందిన తేజ్, తాడికల్లో గ్రామానికి చెందిన శ్రావ్యతో 2020లో ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదట్లో సుఖసంతోషాలతో సాగిన దాంపత్య జీవితం కొంతకాలానికే క్షీణించింది. శ్రావ్య భర్త తేజ్ ఉపాధి కోసం రెండు సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడి నుంచి తరచూ భార్యను ఫోన్‌లో అనుమానిస్తూ, ఎవరితోనైనా సంబంధం పెట్టుకున్నావా అంటూ ప్రశ్నల వర్షం కురిపించేవాడట.
వేదింపులు తాళలేక
ఇటీవల ఈ అనుమానాలు మరింత పెరిగి శ్రావ్య (Shravya) ను మానసికంగా తీవ్రంగా వేధించాయి. తను ,ఎలాంటి తప్పు చేయలేదని, ఎవరితో సంబంధం పెట్టుకోలేదని అనేకసార్లు చెప్పినా భర్త నమ్మకపోవడం ఆమెను మనస్తాపానికి గురిచేసింది. చివరికి ఈ బాధను భరించలేక, శ్రావ్య తన మొబైల్‌లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసింది. వీడియోలో ఆమె కన్నీటి పర్యంతమై మాట్లాడుతూ, తేజ్, నాకెవరితోనూ సంబంధం లేదు. నేను ఎవరితోనూ మాట్లాడలేదు. అందరి మీద ఒట్టు వేసి చెబుతున్నా నన్ను నమ్ము. కావాలంటే నా ఫోన్ చెక్ చెయ్, నిజం తెలుస్తుంది. బాబును మంచిగా చూసుకో, నువ్వు సంతోషంగా ఉండు. నీ టార్చర్ భరించలేకపోతున్నా” అంటూ కన్నీటి ధారలతో తన వేదనను వ్యక్తం చేసింది.
ఆత్మహత్య నివారణ కోసం హెల్ప్‌లైన్ నంబర్లు ఏవైనా ఉన్నాయా?
కిరణ్ మెంటల్ హెల్త్ హెల్ప్‌లైన్ (భారత ప్రభుత్వం): 1800-599-0019.ఆరోగ్య మానసిక సహాయ కేంద్రాలు: వివిధ రాష్ట్రాల్లో ఉచిత కౌన్సెలింగ్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
ఆత్మహత్యకు ప్రధాన కారణాలు ఏమిటి?
డిప్రెషన్, మానసిక సమస్యలు,కుటుంబ కలహాలు, సంబంధ సమస్యలు
Read hindi news: hindi.vaartha.com
Read Also: