📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Crime: మటన్లో కారం తెచ్చిన తంటా.. భార్య భర్తలు ఇద్దరు బలి

Author Icon By Pooja
Updated: October 22, 2025 • 12:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జగిత్యాల(Jagityala) జిల్లా(Crime), ఇబ్రహీంపట్నం మండలం, ఎర్దండి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న బోదాసు సంతోష్ (26), గంగోత్రి (22) అనే కొత్త జంట, పెళ్లైన నెల రోజులు గడవకముందే ఆత్మహత్యకు పాల్పడి కన్నుమూశారు. ఈ ఘటన ఆ రెండు కుటుంబాలలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. సంతోష్ మరియు గంగోత్రి గత నెల సెప్టెంబర్ 26న వివాహం చేసుకున్నారు. పెళ్లైన ఆరు రోజులకే, అంటే దసరా పండుగ రోజున (అక్టోబర్ 2న) గంగోత్రి ఆత్మహత్య చేసుకుంది. మొదటి పండుగ కావడంతో సంతోష్ తన భార్యతో కలిసి అత్తింటికి వెళ్ళిన సందర్భంలో, రాత్రి భోజనం చేస్తున్న సమయంలో మటన్ కూరలో కారం ఎక్కువగా ఉందని భార్య గంగోత్రిని గట్టిగా మందలించాడు. దీనికి మనస్తాపానికి గురైన గంగోత్రి అదే రోజు రాత్రి అత్తింట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

Read Also: President:తృటిలో ప్రమాదం నుంచి తప్పిచ్చుకున్న ద్రౌపదీ ముర్ము

Crime: మటన్ కారంలో తెచ్చిన తంటా.. భార్య భర్తలు ఇద్దరు బలి

భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

భార్య ఆత్మహత్య(Crime) చేసుకోవడాన్ని సంతోష్ తట్టుకోలేకపోయాడు. ఆమెను ఎంతో ఇష్టపడి ప్రేమించి, పెళ్లి చేసుకున్న సంతోష్, ఈ సంఘటన తర్వాత తీవ్ర మనోవేదనకు గురయ్యాడు మరియు గంగోత్రి ఆలోచనలతో కుమిలిపోయాడు. భార్య మరణం జరిగిన సరిగ్గా 19 రోజులకు, అంటే వారం రోజుల కిందట ఆదిలాబాద్‌లో ఉండే తన అక్క ఇంటికి వెళ్లిన సంతోష్, అక్కడ మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లయిన నెల రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు ఇద్దరూ తనువు చాలించడంతో ఎర్దండి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Jagtial Suicide Latest News in Telugu Newly Married Couple Suicide Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.