రాచకొండ పోలీస్(Rachakonda Police) కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో నేరాల సంఖ్య పెరిగినట్లు సీపీ సుధీర్‌బాబు(CP Sudheer Babu) వెల్లడించారు. 2024తో పోలిస్తే ఈ ఏడాది కేసుల నమోదు గణనీయంగా ఎక్కువైందని ఆయన తెలిపారు. గత సంవత్సరం 28,626 కేసులు నమోదు కాగా, 2025లో ఈ సంఖ్య 33,040కు చేరిందని వివరించారు.
Read Also: language: సాంస్కృతిక స్పృహలేని భాషాసేవలేల!
కిడ్నాప్, పోక్సో, సైబర్ నేరాలు పెరుగుదల
ఈ ఏడాది మొత్తం 579 కిడ్నాప్ కేసులు(Kidnapping cases), 1,224 పోక్సో కేసులు, 73 హత్యలు, 330 అత్యాచార కేసులు నమోదైనట్లు సీపీ పేర్కొన్నారు. మహిళలపై నేరాలు గత ఏడాదితో పోలిస్తే సుమారు 4 శాతం పెరిగాయని వెల్లడించారు. డ్రగ్స్ వ్యతిరేక చర్యల్లో భాగంగా రూ.20 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుని, 668 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
సైబర్ నేరాలపై కఠిన చర్యలు
ఈ సంవత్సరం కమిషనరేట్ పరిధిలో మొత్తం 21,056 కేసులను పరిష్కరించినట్లు, అలాగే 12 కేసుల్లో నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష పడేలా కోర్టులు తీర్పులు ఇచ్చినట్లు సీపీ వెల్లడించారు. సైబర్ నేరాల(Cyber crimes)పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెబుతూ, 3,734 సైబర్ కేసులు నమోదు చేసి, 6,188 మంది నేరగాళ్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. సైబర్ మోసాలకు గురైన బాధితులకు రూ.40.10 కోట్లను రిఫండ్ చేయగలిగామని చెప్పారు.
డ్రగ్స్ రవాణా కేసుల్లో 495 మందిని అరెస్టు చేయగా, అందులో 322 మంది తెలంగాణకు చెందినవారు, 172 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు కాగా, ఒక విదేశీయుడు కూడా ఉన్నట్లు సీపీ సుధీర్‌బాబు వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: