📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

CP Sajjanar: న్యూఇయర్‌ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు

Author Icon By Saritha
Updated: December 24, 2025 • 5:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నూతన సంవత్సర వేడుకల పేరుతో రోడ్లపై హంగామా(CP Sajjanar) సృష్టిస్తూ, హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్(Hyderabad) పోలీస్‌ కమిషనర్ సజ్జనార్‌ హెచ్చరించారు. “నిబంధనలు ఉల్లంఘిస్తే కొత్త సంవత్సరం సంతోషం లేకుండా పోతుంది” అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు.న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో నిర్వహించే పార్టీలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన విధి విధానాలపై సీపీ సజ్జనార్ క్షేత్రస్థాయి పోలీస్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Read Also: Hyderabad crime: చిక్కుడుపల్లిలో డ్రగ్స్ కలకలం.. ప్రియుడు ప్రియురాలు అరెస్ట్

ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు

ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఈవెంట్ జరిగే ప్రాంతంలో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. (CP Sajjanar) అలాగే పార్టీల నిర్వహణకు ముందుగా పోలీస్ అనుమతిని తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి పొందాలని సూచించారు.బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే వేడుకల్లో సౌండ్ సిస్టమ్‌లు, లౌడ్ స్పీకర్లు రాత్రి 10 గంటలకే పూర్తిగా నిలిపివేయాలని సీపీ స్పష్టం చేశారు. శబ్ద కాలుష్యంపై ఫిర్యాదులు వస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు, 15 షీ టీమ్స్ బృందాలను మఫ్టీలో రంగంలోకి దింపనున్నట్లు తెలిపారు.ఈ నెల‌ 31 అర్ధరాత్రి నగరమంతటా డ్రంకెన్ డ్రైవ్‌పై ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. రాత్రి 9 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభమవుతాయని, అన్ని ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రజలు ఆనందంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని, అయితే చట్టాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని హైదరాబాద్ పోలీసులు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

crowd control Hyderabad Hyderabad Police Latest News in Telugu New Year 2026 safety New Year Eve security Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.