📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Murder: కాంగ్రెస్ యువ నాయకుని దారుణ హత్య

Author Icon By Sharanya
Updated: July 15, 2025 • 11:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మెదక్: కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దారుణ హత్య (Murder) కు గురైన సంఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వరిగుంతం కు చెందిన మారెల్లి అనిల్ కాంగ్రెస్ పార్టీ (Marelli Anil Congress Party) ఎస్సీ సెల్ జిల్లా నాయకుని గా పని చేస్తున్నాడు. సోమవారం గాంధీ భవన్ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం ను మధ్యలో దించి ఒంటరి గా వెళ్తుండగా అప్పటికే కారులో వెంబడించిన గుర్తు తెలియని వ్యక్తులు అనిల్ పై కాల్పులు జరిపారు. దీంతో అక్కడిక్కడే అనిల్ మృతి చెందాడు.

ముందు ప్రమాదం గా భావించిన స్థానికులు మెదక్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కానీ మృతుని శరీరం పైన బుల్లెట్ గాయాలు ఉన్నాయని వైద్యులు తెలపడం తో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన స్థలంలో పరిశీలించగా నాలుగు బుల్లెట్ లభ్యం అయ్యాయి. దీంతో ప్రమాదం కాదని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


భూ తగాదాలే కారణంగా తెలుస్తుంది..


ఇటీవల మండలలో నాయకుని గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనిల్ మృతిని ఇటు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రాంతానికి చెందిన భూమి విషయంలో అనిల్ సెటిల్మెంట్ చేస్తున్నాడని సమాచారం. ఈ భూ తగాదా (land dispute) విషయంలో కక్ష్య పెంచుకున్న వారే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని స్థానికులు అనిల్ సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


పక్కా ప్లాన్ తో మర్డర్..


మారెల్లి అనిల్ ని పక్క ప్లాన్ ప్రకారమే హత్య (Murder) చేసినట్లు తెలుస్తుంది. పార్టీ కార్యక్రమ నిర్వహణలో భాగంగా గాంధీ భవన్ వెళ్లిన అనిల్ ను అక్కడినుంచే పథకం ప్రకారమే వెంబడించినట్లు తెలుస్తోంది. అనిల్ తన గ్రామానికి చేరుకునే సమయంలో ఒంటరిగా ఉన్నట్లు గుర్తు నిర్మానుష్యంగా ఉన్న సమయంలో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సంఘట తో కొల్చారం మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. యువనాయకుడి మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: MPTC : తెలంగాణ లో ఎంపీటీసీ స్థానాలు ఎన్నంటే?

Breaking News Brutal Murder Congress Leader Murder latest news Marelli Anil Political Violence Telangana Crime News Telugu News Youth Leader Killed

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.