తెలంగాణ Congress : కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేపడుతున్న అభివృద్ది (Development) సంక్షేమంను ప్రజలకు వివరించి వారి మద్దతు కూడగట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలలో విజయదుందిభి మ్రోగించాలని వందకు వంద సర్పంచ్లు, ఎంటిపిసిలు, జడ్పీటిసిలు, ఎంపిపిలు, జడ్పీచైర్మన్లు కైవసం చేసుకోవాలని టిపిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. బుధవారం గాంధీభవన్లో ఆర్మూర్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి పార్టీ ముఖ్య కార్యకర్తలతో టిపిసిసి చీఫ్ సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలతో ప్రతి బూత్ లెవల్ లో పార్టీని పటిష్టంగా ముందుకు తీసుకొని పొయే అవకాశం ఉంటుందని దాని కోసం కృషిచేయాలని ఆయన మార్గనిర్దేశనం చేశారు. ఆర్మూర్ నియోజక వర్గంలో స్థానిక సంస్థల అన్నింటని గెలవాలని అందుకు క్షేత్రస్థాయి లో పనిచేయాలని ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని ఆయనకోరారు. కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా కష్టపడి పని చేసి సర్పంచ్, ఎంపిటిసి, జడ్పీటీసీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ లు అన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా పకడ్బందీగా ప్రణాళికతో ముందుకు పోవాలని అన్నారు. ఆర్మూర్ నియోజక వర్గాన్ని నా స్వంత నియోజక వర్గంగా చూసుకుంటా అని చెప్పారు. కార్యకర్తలకు, నాయకులకు ఎలాంటి సమస్యలు వచ్చినా కలిసికట్టుగా పని చేసుకొని పరిష్కరించుకుందామని చెప్పారు. సమస్యలు ఉంటే ఇంచార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళితే నేనే వెంట ఉండి పని చేసి పెడతా అని అన్నారు.
ఆర్మూరులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్
ఆర్మూర్కు ప్రభుత్వం నుంచి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు అయిందని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నామని అన్నారు. 42 శాతం బిసి రిజర్వేషన్లు (BC Reservations) విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో అమలు అయ్యేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేసిందని అన్నారు. బీజేపీ కేంద్రంలో అటు బిల్లు అమలు కాకుండా ఇటు ఆర్డినెన్స్ అమలు కాకుండా అడ్డు పడుతుందని బిజెపి, బిఆర్ ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కు అయ్యి బిసి రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుపడుతున్నాయని ఇది ప్రజలు గమనించాలని ఆయన అన్నారు. కులాల వాటా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని రాహుల్ గాంధీ గారు మొట్టమొదట ఉద్యమాన్ని లేవనెత్తారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఎంతో కృతనిశ్చయంతో బిసి రిజర్వేషన్లు అమలు చేసేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నారని అందుకోసం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.
ప్రజల్లోకి కాంగ్రెస్ సంక్షేమ పథకాల విస్తృత ప్రచారం చేయాలని పిలుపు
దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అన్నారు. రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ, ఆర్టీసీలలో మహిళలకు ఉచిత రవాణా, 500 రూపాయలకు గ్యాస్, 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణాల మాఫీ, ఎకరాకు 12 వేల రైతు భరోసా, రెసిడెన్షియల్ స్కూల్స్, స్పోర్ట్స్ పాలసీ, ఫోర్త్ సిటీ లాంటి అనేక విప్లవాత్మక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఇవన్నీ కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో ఏ ప్రభుత్వం చేయనంత వేగంగా పకడ్బందీగా చేస్తున్న అంశాలలో ప్రచారం చేసి స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా చూడాలని అన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :