📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

CLP Meeting : నేడు కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం

Author Icon By Sudheer
Updated: April 15, 2025 • 6:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం నేడు ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల్లోకి వాటి ప్రాధాన్యత చాటించడంపై ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చ జరగనుంది. ముఖ్యంగా ‘సన్నబియ్యం’, ‘ఇందిరమ్మ ఇళ్లు’, ‘భూభారతి’ వంటి పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు వివరించి, ప్రజల మద్దతు పొందేలా చేసే వ్యూహాలపై నేతలకు మార్గదర్శనం చేయనున్నారు.

ఎస్సీల వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాలు

ఇకపోతే, ఎస్సీల వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాలు కూడా ముఖ్యాంశాలుగా చర్చకు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ విధానాన్ని ప్రజల్లోకి చక్కగా తీసుకెళ్లేందుకు శాసన సభ్యులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించే అవకాశముంది. రానున్న ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా పార్టీలో ఏకతాటిపై కార్యాచరణ కొనసాగించాలన్నదే పార్టీ నాయకత్వ ఉద్దేశం.

CLP

కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత వివాదాలు

ఇక, కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత వివాదాలు, సంబంధిత నియోజకవర్గాల్లో కార్యకర్తల మధ్య ఉన్న విభేదాలపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది. పార్టీ బలోపేతం దిశగా సీఎం రేవంత్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సమష్టిగా ముందుకు సాగేందుకు ఈ సమావేశం కీలకంగా మారనుంది. అన్ని అంశాలపై నేతల అభిప్రాయాలను సేకరించి, ఆ తరువాత కేటాయించబోయే బాధ్యతలపై స్పష్టత ఇవ్వనున్నారు.

CLP meeting cm revanth Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.