హైదరాబాద్ నగరంలో ఒక అద్భుతం జరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ Kollapur ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గుగ్గిళ్ల సత్యనారాయణ అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆయన బుధవారం సాయంత్రం మరణించారని వైద్యులు ధృవీకరించడంతో అందరూ షాక్‌కు గురయ్యారు.
Read also: Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో పిడుగుపాటుకు నలుగురి బలి
Kollapur Incident: Man declared dead opens his eyes in the ambulance!
అంత్యక్రియల వేళ అంబులెన్స్‌లో సంచలనం
మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తుండగా మార్గమధ్యలో సత్యనారాయణ ఒక్కసారిగా కళ్లు తెరిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. చేతులు కదిలిస్తూ స్పందించడంతో అంబులెన్స్‌లో ఉన్న బంధువులు ఒక్కసారిగా ఆనందానికి లోనయ్యారు. ఇంటి వద్ద అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన తరుణంలో ఆయన బతికి రావడం పెను సంచలనంగా మారింది.
ఆసుపత్రి నిర్లక్ష్యంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
ప్రాణాలతో ఉన్న వ్యక్తిని చనిపోయాడని ప్రకటించిన ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఆయనను మలక్‌పేట యశోద కి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: