📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Congress government: హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్: ఏలేటి మహేశ్వర్రెడ్డి

Author Icon By Digital
Updated: August 30, 2025 • 11:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాంగ్రెస్ హామీలపై విమర్శలు

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ లను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తున్న అంశాలను ప్రస్తావించినట్లు బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Yeleti Maheshwar Reddy) తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బిజెపి శాసనసభ, శాసనమండలి సభ్యుల సమావేశం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించే విషయాలపై చర్చిం చినట్లు తెలిపారు.

మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు

సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 420 తప్పుడు హామీలతో పాటు దాదాపు 6 గ్యారంటీలకు(Congress government) చట్టబద్ధత కల్పిస్తామన్న రేవంత్ రెడ్డి(Revanth Reddy)అసెంబ్లీ సాక్షి గా చేసిన ప్రకటనను పూర్తిగా విస్మరించారని అన్నారు. యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేస్తున్న రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

రాబోయే ఎన్నికలు మరియు అవినీతి ఆరోపణలు

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి లకు 42 శాతం రిజర్వే షన్ల అంశం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్షకోట్ల అవినీతి జరిగిందని పదేపదే చెప్పిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, ఇవన్నీ ప్రజల ను మభ్యపెట్టడానికి మాత్రమే అన్నారు. లక్ష కోట్ల అవినీతి కక్కిస్తా, ఆ డబ్బులతో సంక్షేమ కార్య క్రమాలు చేపడతా నని రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్పటికీ, 2 సంవత్సరాల పాలన గడిచినా ఇప్పట వరకు అవినీతి పరులపై కేసులు నమోదు చేయ లేదు. ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేద న్నారు.

నెరవేరని హామీలు

100 రోజుల్లో హామీలను నెరవేర్చుతాం, 100 రోజుల్లో అవినీతి సొమ్మును రికవరీ చేస్తాం, 100 రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి(Congress government) దాదాపు 20 నెలలు గడిచినా ఇప్పటివరకు అవినీతి సొమ్ము బయట పెట్టలేదన్నారు. ప్రజాసమస్యలను, అభివృద్ధి అంశాలను విస్మరిస్తూ ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ ప్రభుత్వాన్ని బిజెపి పక్షాన ఖచ్చితంగా నిలదీస్తామన్నారు.

వరదలు మరియు సహాయక చర్యలు

మరోవైపు భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించి పంట నష్టం జరిగిందని, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కావడంతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం వెంటనే స్పందించి హెలికాప్టర్లతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపి రెస్క్యు ఆపరేషన్ చేపట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సహాయక చర్యల్లో పూర్తిగా విఫలమైం దన్నారు.

బిజెపి పర్యవేక్షణ

మంత్రులను క్షేత్రస్థాయికి పంపించి నష్టాన్ని అంచనా వేయాలని, తక్షణమే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి బాధితులకు న్యాయం చేయాల న్నారు. బిజెపి ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో కూడిన బృందం ఈ విషయాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించి అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌పై ఏ ఆరోపణలు చేశారు?
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయక ప్రజలను మోసం చేసిందని, లక్షకోట్ల అవినీతి ఆరోపణలు కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి హామీలు ఏమిటి?
100 రోజుల్లో అవినీతి సొమ్మును రికవరీ చేస్తామని, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తామని, బిసి లకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీలను నెరవేర్చలేదని విమర్శలు వచ్చాయి?
420 తప్పుడు హామీలు, 6 గ్యారంటీల చట్టబద్ధత, అవినీతి రికవరీ హామీలు, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభం వంటి విషయాలు అమలు కాలేదని విమర్శలు వచ్చాయి

Read Hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/court-pinnelli-brothers-face-setback-in-high-court-double-murder-case/andhra-pradesh/538106/

BJP leader Aleti Maheswar Reddy Kaleshwaram project scam Revanth Reddy promises Telangana Congress Government

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.