📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Hydra On Manholes: మ్యాన్‌హోల్‌ ఘటన పై కమిషనర్ రంగనాథ్ సీరియస్

Author Icon By Sudheer
Updated: September 12, 2025 • 9:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ యాకత్‌పురలో ఓ చిన్నారి మ్యాన్‌హోల్‌(Manhole)లో పడిన ఘటన కలకలం రేపింది. స్కూల్ నుంచి వస్తున్న సమయంలో ఆటోను గమనిస్తూ వెళ్తుండగా పాప అనుకోకుండా తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. అదృష్టవశాత్తు, వెంట వచ్చిన మహిళా సకాలంలో గమనించి, చుట్టుపక్కల వారి సహాయంతో చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ సంఘటన సమీప సీసీటీవీల్లో రికార్డ్ అవ్వగా, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

జీహెచ్‌ఎంసీ నిరాకరణ, హైడ్రా బాధ్యత

ఈ ఘటనతో ప్రజల ఆగ్రహం జీహెచ్‌ఎంసీ(GHMC)పై వెల్లువెత్తింది. వర్షాకాలంలో మ్యాన్‌హోల్‌లను ఇలా నిర్లక్ష్యంగా తెరిచి ఉంచడమేంటని నెటిజన్లు మండిపడ్డారు. అయితే, జీహెచ్‌ఎంసీ మాత్రం ఈ ఘటనకు తమకు సంబంధం లేదని స్పష్టంచేసింది. మ్యాన్‌హోల్ నిర్వహణ బాధ్యతలు హైడ్రాకు అప్పగించబడినట్లు వెల్లడించింది. దీంతో విమర్శల దృష్టి హైడ్రాపై కేంద్రీకృతమైంది.

హైడ్రా అంగీకారం, చర్యలకు హామీ

తీవ్ర విమర్శల నడుమ హైడ్రా చివరికి స్పందించింది. కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, ఈ ఘటనకు హైడ్రానే పూర్తిగా బాధ్యత వహిస్తుందని అంగీకరించారు. మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇంఛార్జ్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో నిర్లక్ష్యం మరల జరగదని హామీ ఇచ్చారు.

https://vaartha.com/former-pithapuram-mla-varma-to-join-ysrcp/breaking-news/546232/

Google News in Telugu hyderabad hydraa Manhole manhole incident

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.