Mahabubnagar: జిల్లాలో ఎస్ సి, ఎస్ టి అట్రాసిటీ భాదితులకి సత్వర న్యాయం జరిగేలా చూడాలని, ఎస్సి, ఎస్.టి. అట్రాసిటీ పెండింగ్ కేసులు జులై 12 లోగా పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సి, ఎసిటి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులకు సూచించారు. మహబూబ్ నాగ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్సి, ఎస్టి అత్యాచార కేసులు, భూ సమస్యలు, వివిధ ద్వారా ఎస్సి, ఎస్టిలకు సంక్షేమ పథకాల అమల పై తెలంగాణ రాష్ట్ర ఎస్సి, ఎస్టి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు నీలాదేవి, శంకర్, రాంబాబు నాయక్, లక్ష్మీనారాయ ణలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎసిసి, ఎస్టిలకు సంబంధించిన భూ సమస్యలు కూడా నెల రోజుల్లోగా జూలై 12 నాటికి భూ భారతి నూతన చట్టం ద్వారా పరిష్కారం చేయాలని సూచించారు.
భూ భారతి చట్టంతో ఎస్సి, ఎస్టి భూముల సమస్యలకు పరిష్కారం
ధరణి ద్వారా పరిష్కారం కాని వాటిని భూ భారతి నూతన చట్టం ద్వారా ఎస్సిలు, ఎస్టి ల భూ సమస్యలు పరిష్కారం చేయాలని అన్నారు. పోలీస్ శాఖ ద్వారా నమోదు అయిన ఎస్సి, ఎస్టి కేసులు గురించి ఎస్.పి.డి.జానకి వివరించారు. ఈ సంవత్సరం 26 కేసులు నమోదు కాగా 6 ఛార్జీ షీట్ చేసినట్లు, 20 కేసులు విచారణలో ఉన్నట్లు తెలిపారు. గత సంవత్సరం 78 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 2014 సంవత్సరం నుండి 2023 వరకు 530 కేసులకు గాను 90 కేసులు ఛార్జిషీట్ వేయలేదు. కారణాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని కోర్ట్ లో పెండింగ్, కుల ధృవీకరణ పత్రాల వలన పెండింగ్ ఉన్నట్టు తెలిపారు. కుల ధృవీకరణ సర్టిఫికెట్ పెండింగ్ ఉంటే ఎస్సి అభివృద్ధి అధికారి అటువంటి కేసులకు సంబంధించి జిల్లా కలెక్టర్ ద్వారా ధృవీకరణ సర్టిఫికెట్లు జారీ చేయాలని అన్నారు. 2023,24 సంవత్సరం 27 అట్రాసిటీ కేసులకు సంబంధించి బాధితులకు పరిహారం చెల్లించినట్లు అధికారులు వివరించారు.
71 మందికి 78 లక్షల పరిహారం నిధుల కోసం చర్యలు
ఈ సంవత్సరం 71 మందికి 78 లక్షలు పరిహారం చెల్లింపుకు నిధులు రావలసి ఉందని తెలిపారు. సంబంధిత శాఖ రాష్ట్ర అధికారులు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రితో మాట్లాడి నిధులు విడుదల చేస్తానని చైర్మన్ తెలిపారు. అంబేద్కర్ విదేశీ విద్యానిధి కింద గత సంవత్సరం ఒక అమ్మాయికి 20 లక్షలు విదేశాల్లో చదువు కునేందుకు మంజూరు చేసినట్లు ఎస్సి అభివృద్ధి అధికారి తెలిపారు. జిల్లాలో ఎస్సి, ఎస్టి జనాభా ఎక్కువ గా ఉందని, సుమారు 23 శాతం ఉన్నారని, ఎక్కువ సంఖ్యలో వారికి లబ్ది జరిగేలా చూడాలని అన్నారు. ప్రతినెల చివరి రోజున ఖచ్చితంగా పౌర హక్కుల దినోత్సవం జరిగేలా చూడాలని, హెడ్ కానిస్టేబుల్ ఆర్ఐల ద్వారా నిర్వహిస్తున్నారని అలా చేయకుండా తహసీల్దార్, ఎస్ఐ పౌరహక్కుల దినోత్సవానికి హాజరు ప్రజలకి చట్టం పై అవగాహన కల్పించాలని సూచించారు. అధికారులతో పాటు దళిత సంఘాలను పిలవాలని అన్నారు పౌర హక్కుల దినోత్సవం సంవత్సరం కార్యాచరణ సిద్ధం చేయాలని, కమిషన్ సభ్యులకు కూడా సమాచారం ఇస్తే చైర్మన్, లేదా సభ్యులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఎస్సి, ఎస్టి లకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పథకాల్లో వారి వాటా గురించి అవగాహన కలిగించాలన్నారు. అధికారులు ప్రతి మూడు నెలల కొక సారి ఎస్సి, ఎస్టి అట్రాసిటీస్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిపి సమీక్షించాలని అన్నారు. ఎస్సి, ఎస్టి కమిషన్ ఎస్సి, ఎస్టి లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం దిశగా పని చేస్తుందని పేర్కొన్నారు ఎస్, ఎస్టి ల భూములు ఆక్రమణ చేస్తే ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించేది లేదని తెలిపారు.
Read also: Degree: డిగ్రీ రెండో విడత సీట్ల కేటాయింపు