📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

College Closed: 50 ప్రైవేటు డిగ్రీ కాలేజీల మూసివేత?

Author Icon By Anusha
Updated: July 21, 2025 • 3:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

63 కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కాని వైనం

957 డిగ్రీ కాలేజీల్లో 1,41,590 అడ్మిషన్లు

హైదరాబాద్ : రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 50 కాలేజీలకి పైగా మూతపడనున్నాయి. ఆయా కాలేజీల్లో ఈ ఏడాది డిగ్రీ మొదటి సంవత్సరంలో ఒక్క అడ్మిషన్ కూడా కాలేదు. ఈ ఏడాది కాదు, గత ఏడాది కూడా ఈ కాలేజీల్లో ఒక్క సీటు కూడా భర్తీ కానట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రతి ఏడాది డిగ్రీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) పేరుతో అడ్మిషన్ల ప్రక్రియను చేపడుతున్నారు. గత తొమ్మిదేళ్లుగా డిగ్రీ అడ్మిషన్లును దోస్త్ ద్వారానే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేటు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఏ కాలేజీలో ఎన్ని సీట్లు భర్తీ అయ్యాయనే విషయాన్ని దోస్త్అధికారులు వెల్లడిస్తున్నారు.

కాలేజీల స్లైడింగ్కి

ఈ ఏడాది కూడా 2025-26 విద్యా సంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం దోస్త్-2025 ద్వారా అడ్మిషన్లను చేపట్టారు. మొత్తం మూడు విడతల్లో సీట్ల కేటాయింపును చేపట్టడమే కాకుండా చివరిగా ఇంట్రా కాలేజీల స్లైడింగ్కి (Intra-college sliding) అవకాశం కల్పించారు. మూడు విడతల్లో సీట్ల కేటాయింపు చేపట్టిన తరువాత విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టింగ్ చేశారు. విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టింగ్ చేసిన తరువాత అడ్మిషన్ల ప్రక్రియను పరిశీలించిన అధికారులు, రాష్ట్రంలోని 64 డిగ్రీ కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కూడా కాలేదని ప్రకటించారు. వాటిలో 63 ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉండగా, ఒక్కటి మాత్రం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఉంది.

College Closed: 50 ప్రైవేటు డిగ్రీ కాలేజీల మూసివేత?

అధికారిక లెక్కలు

మొత్తం 64 డిగ్రీ కాలేజీల్లో 20,260 సీట్లు ఉన్నాయి. 63 ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ఈ ఏడాది ఒక్క అడ్మిషన్ కూడా జరగలేదు. వీటిలో సుమారు 50కి పైగా డిగ్రీ కాలేజీల్లో గత ఏడాది కూడా అడ్మిషన్లు జరగలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఈ 50కిపైగా ప్రైవేటు డిగ్రీ కాలేజీ (Degree College) ల ను మూసివేసేందుకు కాలేజీ యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత ఏడాది అడ్మిషన్లు జరగకపోవడం, ఈ ఏడాది అడ్మిషన్లు రాకపోవడంతో 2022-23లో చేరిన విద్యార్థులు ఈ ఏడాదితో డిగ్రీ పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి కాలేజీలను మూసివేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

అడ్మిషన్ల ప్రక్రియ

2014 నుంచి రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల మూసివేత కొనసాగుతూనే ఉంది. 2014లో సుమారు 1100 వరకు ఉన్న కాలేజీలు మూతపడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 900కి పడిపోయాయి. గత ఏడాది, ఈ ఏడాది అడ్మిషన్లు రాని కాలేజీలు మూతపడనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న 676 ప్రైవేటు డిగ్రీ కాలేజీ (Private degree college) లు కొనసాగుతుండగా వాటిలో సుమారు 3లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. 3 లక్షల సీట్లలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యే సరికి సుమారు 80వేల అడ్మిషన్లు పూర్తయినట్టు అధికారులు, ప్రకటించిన లెక్కలనుబట్టి తెలు స్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలు 957 ఉన్నాయని వాటిలో 4,36,947 సీట్లు అందుబాటులో ఉండగా వాటిలో 1,41,590 సీట్లు భర్తీ అయినట్టు దోస్త్ అధికారులు ప్రకటించారు.

తెలంగాణలో ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి?

2025 నాటికి, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 1,100కు పైగా ప్రైవేటు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే, మిగిలినవి ప్రైవేటు మేనేజ్‌మెంట్ కింద నడుపబడుతున్నాయి.

తెలంగాణలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల ప్రత్యేకతలు ఏమిటి?

ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు తక్కువ ఫీజుతో మెరుగైన విద్యను అందిస్తాయి. ఈ కాలేజీలు TG ICET లేదా ఇతర ప్రవేశ పరీక్షల ద్వారా అడ్మిషన్లు కల్పిస్తాయి. అంతేకాక, లాభదాయకమైన కోర్సులు, లైబ్రరీలు, ప్రయోగశాలలు అందుబాటులో ఉంటాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Bonalu 2025: అంగరంగవైభవంగా లాల్ దర్వాజ మహంకాళి బోనాలు వేడుకలు

Breaking News colleges shutdown degree first year admissions higher education crisis latest news low admissions private colleges closure private degree colleges Telangana Education Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.