పెద్ద శంకరంపేట మండలంలో రైతు వేదికలో ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ ముందుగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజన ఉత్సవ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులతో కలిసి కలెక్టర్(Collector Rahul Raj) పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన బోధనలు, దార్శనికతను స్ఫూర్తిని నింపుకోవాలని తెలిపారు.విద్యార్థి దశ నుండి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా యువతీ యువకుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెరుగుతాయని కలెక్టర్ అన్నారు.
Read Also: Medak: పెద్ద శంకరంపేటలో ప్రజావాణి పాల్గొన్న జిల్లా కలెక్టర్
జాతీయ సమైక్యత, మత సామరస్యం, సోదరభావం వంటి వివేకానందుడి ఆశయాలను యువతలో ప్రచారం చేయాలన్నారు.యువతలోని ప్రతిభను వెలికితీసి, వారిలో(Collector Rahul Raj) మానవత్వానికి సేవ చేయాలనే స్ఫూర్తిని నింపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో, షాకీర్ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: