📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Prajavani Grievances: ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: ప్రతిమా సింగ్

Author Icon By Siva Prasad
Updated: March 9, 2026 • 11:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Prajavani Grievances: మెదక్: ప్రజల నుండి అందే ప్రజావాణి అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పెండింగ్ దరఖాస్తులను అర్హత మేరకు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణి హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రజల నుండి నేరుగా వినతులను స్వీకరించారు.

Read Also: Sakala Janula Samme: కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

80 దరఖాస్తుల స్వీకరణ

ఈ వారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల నుండి 80 వినతులు అందాయి. గత వారం అందిన దరఖాస్తులపై అధికారులు తీసుకున్న చర్యలను కలెక్టర్ శాఖల వారీగా సమీక్షించారు. అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Special attention needs to be paid to public petitions: Pratima Singh

Prajavani Grievances: క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరి

అనంతరం అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులందరూ కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. గ్రామాల్లో పర్యటించినప్పుడే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని, తద్వారా అభివృద్ధి పథకాలపై స్పష్టమైన నివేదికలు అందజేయవచ్చని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అత్యంత చేరువ చేయడంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఆమె హెచ్చరించారు.

పటిష్ట కార్యచరణతో ముందడుగు

శాఖల వారీగా పనితీరు మెరుగుపడేందుకు పటిష్టమైన కార్యచరణతో ముందుకు వెళ్తున్నామని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డి.ఆర్.డి.ఓ పీడీ శ్రీనివాసరావు మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Collector Pratima Singh District Collector Review Meeting Government Schemes Implementation Medak News Pending Applications Redressal Prajavani Grievances

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.