తెలంగాణ (TG Weather) రాష్ట్రవ్యాప్తంగా శీతల గాలులు వీచడంతో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మంటలు వేసుకుని వేడిని పొందుతున్నారు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, కొమురం భీం-ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ) ప్రాంతంలో మంగళవారం రాత్రి అత్యల్పంగా 10.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల్లో ఒకటిగా గుర్తించారు.
Read Also: TG: తెలంగాణ సచివాలయంలో 134 మంది ఏఎస్ఓల బదిలీ
ఈ నెలలో సగటు ఉష్ణోగ్రతలు 13 నుంచి 17 డిగ్రీల
ఉదయం పొగమంచు, చలిగాలులు, రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.రాష్ట్రంలో సగటున 4 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయని తెలిపారు. ఈ నెలలో సగటు ఉష్ణోగ్రతలు 13 నుంచి 17 డిగ్రీల మధ్య కొనసాగే అవకాశం ఉందన్నారు. రాబోయే వారం రోజులు ఇదే తరహా చలి వాతావరణం (TG Weather) ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం- ఆసిఫాబాద్, నల్గొండ, భద్రాచలం, రామగుండం, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, పటాన్‌చెరు, నిజామాబాద్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ శివారు హయత్‌నగర్ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 26 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నా.. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రం అత్యల్పానికి పడిపోతాయన్నారు. చాలా ప్రాంతాల్లో 16 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: