తెలంగాణ లో (TG Weather) చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చలి వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో చురుగ్గా వీస్తున్న ఈశాన్య గాలుల కారణంగానే చలి (TG Weather) తీవ్రత మరింత పెరిగింది. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత 12.8 డిగ్రీల నుంచి 7.2 డిగ్రీలకు పడిపోయింది.
Read Also: Grama Panchayat Elections : ‘పంచాయతీ’ పోరుకు యూత్ సై !!
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు
ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. హెచ్‌సీయూ, బీహెచ్‌ఈఎల్ ప్రాంతాల్లో 8.8 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 9.4, మౌలాలీలో 9.6, శివరాంపల్లిలో 10.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరింత చలి తీవ్రత పెరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: