📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

CockFighting: అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు

Author Icon By Pooja
Updated: January 11, 2026 • 4:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి

ఎస్పీ: డి. వి. శ్రీనివాస రావు, ఐపీఎస్

మెదక్ జిల్లా పరిధిలో పేకాట, కోడిపందాలు(CockFighting) వంటి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించేందుకు పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తరహా అక్రమ కార్యకలాపాలు శాంతిభద్రతలకు భంగం కలిగించడమే కాకుండా యువతను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉందని అన్నారు.

Read also: Karimnagar: ‘లైసెన్స్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి’

అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు(CockFighting) జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందని, అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో నిరంతర వాహన తనిఖీలు, రాత్రి–పగలు గస్తీ ముమ్మరం చేసినట్లు తెలిపారు. పేకాట, కోడిపందాలు నిర్వహించే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

అలాగే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి గురించి సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో గానీ లేదా డయల్–100 ద్వారా గానీ పోలీసులకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు. ప్రజలు అందించే సమాచారం ఆధారంగా తక్షణమే చర్యలు చేపడతామని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు, వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఆయన హామీ ఇచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం ఎంతో కీలకమని, చట్ట విరుద్ధ కార్యకలాపాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

GamblingBan Google News in Telugu IllegalActivities Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.