📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Telugu News: CMD Balaram:జాబ్ మేళాలతో 23,650 మందికి ఉద్యోగాలు

Author Icon By Sushmitha
Updated: October 29, 2025 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: సింగరేణి సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాలు విజయవంతంగా పూర్తయ్యాయని సంస్థ సీఎండీ ఎన్. బలరాం(CMD Balaram) తెలిపారు. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 7 పట్టణాల్లో నిర్వహించిన ఈ భారీ జాబ్ మేళాల్లో 66,965 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా, వీరిలో 23,650 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

Read Also: Montha Cyclone: రెండు తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుఫాన్‌ బీభత్సం

లక్ష్యం, నిర్వహణ వివరాలు

పట్టణ, గ్రామీణ ప్రాంతాల యువత ముంగిటకే హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీలను తీసుకువచ్చి, వారి అర్హతలకు తగిన ఉద్యోగాలను ఎంచుకునే అరుదైన అవకాశాన్ని సింగరేణి కల్పిస్తోందని సీఎండీ అన్నారు. ఇంత భారీ ఎత్తున జాబ్ మేళాలు(job mela) నిర్వహించడం, పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడం ఇదే ప్రథమమని ఆయన పేర్కొన్నారు. ఏడవ తరగతి మొదలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు, టెక్నికల్, మెడికల్, పారామెడికల్ తదితర అన్ని విద్యార్హతలు గల వారికి ఇక్కడ అవకాశం దక్కింది. ఒక్కో జాబ్ మేళా కార్యక్రమంలో 100 నుండి 250 వరకు ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు పాల్గొన్నాయి.

ప్రారంభం, భవిష్యత్ ప్రణాళికలు

ఈ జాబ్ మేళా కార్యక్రమాలను ఏప్రిల్ 21న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) మధిర నుంచి ప్రారంభించారు. అప్పటి నుంచి అది నిర్విఘ్నంగా కొనసాగుతోంది. మధిరతో పాటు, భూపాలపల్లి, గోదావరిఖని, వైరా, హుజూర్ నగర్, సత్తుపల్లి, బెల్లంపల్లిలలో ఈ మెగా జాబ్ మేళాలను నిర్వహించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో కూడా ఇటువంటి ఉద్యోగ మేళాలకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని, త్వరలోనే కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, ఆసిఫాబాద్ తదితర ప్రాంతాల్లో మెగా ఉద్యోగ మేళాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

సింగరేణి జాబ్ మేళాల్లో ఎంతమందికి ఉద్యోగావకాశాలు లభించాయి?

66,965 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా, 23,650 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి.

జాబ్ మేళాలు ఎక్కడెక్కడ నిర్వహించారు?

మధిర, భూపాలపల్లి, గోదావరిఖని, వైరా, హుజూర్ నగర్, సత్తుపల్లి, బెల్లంపల్లిలలో నిర్వహించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

Google News in Telugu Latest News in Telugu Mega Job Mela N. Balaram. singareni Telangana jobs unemployment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.