📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: CM Revanth Reddy: నేడు రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం

Author Icon By Anusha
Updated: September 28, 2025 • 10:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ నగరం గత కొన్నేళ్లుగా విస్తృత స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. ఐటీ హబ్‌ (IT Hub) గా పేరుపొందిన ఈ మహానగరం మౌలిక వసతుల పరంగా దేశంలోనే ముందంజలో నిలుస్తోంది. ఇప్పుడు ఈ అభివృద్ధి యాత్రలో మరో కీలక ఘట్టానికి తెరలేవనుంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)ను ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)తో అనుసంధానించే ప్రతిష్టాత్మక “రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రహదారి” నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు శంకుస్థాపన చేయనున్నారు.

Future City : రేపు ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన

ఈ ప్రాజెక్టు నగర శివారు ప్రాంతాల స్వరూపాన్నే మార్చేస్తుందని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య దూరాన్ని గణనీయంగా తగ్గిస్తుందని అధికారులు భావిస్తున్నారు.రావిర్యాల్ ఓఆర్‌ఆర్‌ (ORR) ఇంటర్‌ఛేంజ్ నుంచి ఆమన్‌గల్ వరకు మొత్తం 41.50 కిలోమీటర్ల పొడవునా ఈ రహదారిని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ. 4,621 కోట్లు వెచ్చించనుంది.

ఇప్పటికే హెచ్‌ఎండీఏ ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. ఒప్పందం ప్రకారం, నిర్మాణ పనులను 30 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలోని ఆరు మండలాల్లోని 14 గ్రామాల గుండా ఈ రహదారి ప్రయాణించనుంది.

CM Revanth Reddy

ఒక ప్రత్యేక కారిడార్‌గా నిలవనుంది

ఈ గ్రీన్‌ఫీల్డ్ రహదారి (Greenfield Road) కేవలం రవాణా సౌకర్యాలకే పరిమితం కాకుండా, ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ‘ఫ్యూచర్ సిటీ’కి ఒక ప్రత్యేక కారిడార్‌గా నిలవనుంది. దీనివల్ల ఈ-సిటీకి మెరుగైన అనుసంధానం ఏర్పడి, ఐటీ పార్కులు, పరిశోధన కేంద్రాలు, ఆధునిక నివాస సముదాయాల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది.

అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ‘మేక్ ఇన్ తెలంగాణ’ కార్యక్రమానికి కూడా ఇది ఊతమిస్తుందని అంచనా వేస్తున్నారు.100 మీటర్ల వెడల్పుతో కంట్రోల్డ్ యాక్సెస్ ఎక్స్‌ప్రెస్‌వేగా దీనిని తీర్చిదిద్దనున్నారు. తొలుత ఇరువైపులా మూడు లేన్లతో (3+3) నిర్మించి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎనిమిది లేన్ల (4+4) వరకు విస్తరించేలా ప్రణాళికలు రూపొందించారు.

అటవీ అనుమతుల కోసం హెచ్‌ఎండీఏ ఇప్పటికే దరఖాస్తు

ఈ రహదారి మార్గంలో 8.94 కిలోమీటర్ల భాగం ఏడు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌ల మీదుగా వెళ్లనుండగా, అవసరమైన అటవీ అనుమతుల కోసం హెచ్‌ఎండీఏ ఇప్పటికే దరఖాస్తు చేసింది.ఈ భారీ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టనున్నారు. తొలి దశలో రావిర్యాల్ నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు 19.20 కిలోమీటర్ల రహదారిని రూ. 1,911 కోట్లతో నిర్మిస్తారు.

రెండో దశలో మీర్‌ఖాన్‌పేట నుంచి ఆమన్‌గల్ వరకు 22.30 కిలోమీటర్ల మార్గాన్ని రూ. 2,710 కోట్ల వ్యయంతో పూర్తి చేస్తారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఆయా గ్రామాలకు మహర్దశ పట్టడంతో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల అభివృద్ధి మరింత వేగవంతం కానుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Hyderabad Development hyderabad projects latest news Outer Ring Road ratan tata greenfield road regional ring road revant reddy road connectivity telangana infrastructure Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.