📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

L&T ఎందుకు వెళ్లిపోయిందో సీఎం సమాధానం చెప్పాలి – కేటీఆర్ డిమాండ్

Author Icon By Sudheer
Updated: September 26, 2025 • 10:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఎల్ అండ్ టీ (L&T)వివాదం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరింత ఉద్రిక్తం చేశాయి. హైద్రాబాద్ మెట్రో ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ ఎందుకు వెనక్కి వెళ్లిందనే ప్రశ్నను ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై విసిరారు. కరోనా కష్టకాలం, రాష్ట్ర విభజన వంటి కఠిన పరిస్థితులను కూడా ఎదుర్కొని నిలబడిన సంస్థ చివరకు ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా, ఎల్ అండ్ టీ సీఎఫ్వో శంకర్ రామన్‌తో సీఎం చేసిన వ్యవహారం అనవసరమైన బెదిరింపుగా చిత్రీకరించబడింది.

కేటీఆర్ ప్రకారం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy) ఎల్ అండ్ టీని క్రమపద్ధతిగా వేధిస్తూ ప్రాజెక్టుల నుంచి దూరం చేసింది. మేడిగడ్డ, ఎయిర్‌పోర్టు మెట్రో, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి పలు ప్రాజెక్టుల్లో ఎల్ అండ్ టీని అడ్డుకోవడం, బాంబులేటి కంపెనీలకు అవకాశాలు కల్పించడం వంటి ఆరోపణలు చేశారు. మేడిగడ్డలో ఎల్ అండ్ టీ ముందుకు వచ్చి రూ.250 కోట్లు పెట్టి రిపేర్ చేస్తామని చెప్పినా, ప్రభుత్వం ప్రతిస్పందన అహంకారపూరితంగా ఉండటమే కాకుండా, వారిని అవమానించే విధంగా వ్యవహరించిందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ క్రమంలో, కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం, ఎల్ అండ్ టీతో అనుబంధ సమస్యలన్నీ రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్షసాధన ఫలితమని ఆయన ఆరోపించారు.

ఇక ఎల్ అండ్ టీ వెనక్కి వెళ్లిపోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై భారీ భారం పడిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మెట్రో నిర్వహణకు ఇచ్చిన 280 ఎకరాల భూములపై సీఎం మరియు ఆయన అనుచరుల కన్ను ఉందని ఆరోపిస్తూ, ఇది ఒక పెద్ద ఎజెండా భాగమని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి 15 వేల కోట్ల అదనపు భారం పడిందని, ఇప్పటికే 2.2 లక్షల కోట్ల అప్పు కింద కూరుకుపోయిన తెలంగాణలో మరింత ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందని హెచ్చరించారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, డీఏలు, పింఛన్లకు నిధులు లేవని, మరోవైపు రాజకీయ ప్రయోజనాల కోసం వనరులను వృధా చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

cm revanth Google News in Telugu ktr L&T

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.