తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth ) నేడు యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటన (Yadadri Bhuvanagiri district tour)లో భాగంగా ఆలేరు నియోజకవర్గాన్ని సందర్శించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తుర్కపల్లి మండలం తిర్మలాపురం గ్రామంకి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో సీఎం పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నివాస గృహాలను పంపిణీ చేయనున్నారు.
రూ.1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలు, ప్రజలకిచ్చే ప్రాధాన్యతను సీఎం ప్రజలకు వివరించనున్నారు. అలాగే, రూ.1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ అభివృద్ధి పనుల్లో రోడ్లు, మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాలు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. దీనివల్ల స్థానిక ప్రజలకు జీవన ప్రమాణాలు మెరుగవుతాయని భావిస్తున్నారు.
తిర్మలాపురం గ్రామంలో బహిరంగ సభ
పర్యటన చివరగా సీఎం రేవంత్ రెడ్డి తిర్మలాపురం గ్రామంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో ఆయన ప్రజలతో ముఖాముఖీగా మాట్లాడే అవకాశం ఉంది. ప్రభుత్వం చేపడుతున్న పథకాల వివరాలు, అభివృద్ధిపై దృష్టి, భవిష్యత్ ప్రణాళికలపై ముఖ్యంగా ప్రసంగించనున్నారు. స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు పెద్దఎత్తున సభకు హాజరవ్వనున్నారు.
Read Also : Bakrid 2025 : ఆవులు, దూడలు, ఒంటెలను వధిస్తే చర్యలు – AP రాష్ట్ర పశుసంవర్ధక శాఖ