📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Phone Tapping Case : కేసీఆర్ సిట్ విచారణ పై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Author Icon By Sudheer
Updated: February 2, 2026 • 8:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ‘ఫోన్ ట్యాపింగ్’ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ (SIT) నోటీసులు జారీ చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. కేసీఆర్‌ను ఒక జాతిపితగా, ఉద్యమకారుడిగా అభివర్ణిస్తూ.. అటువంటి వ్యక్తికి నోటీసులు ఇవ్వడం తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించడమేనని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “ఉద్యమకారులు అని వారికి వారే రాసుకుంటున్నారు తప్ప, ప్రజలు అలా భావించడం లేదు” అని వ్యాఖ్యానించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, నోటీసులు ఇస్తే దానిని ఎదుర్కోవాలి కానీ, ఉద్యమం పేరుతో తప్పించుకోవాలని చూడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

YSRCP: చంద్రబాబు ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు

కేసీఆర్‌ను విచారించడమంటే తెలంగాణ చరిత్రను కించపరచడమేనన్న విపక్షాల వాదనను రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. నోటీసులు ఇస్తే గగ్గోలు పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక నేరమని, దాని వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరో తేలాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను వెలికితీయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ‘జాతిపిత’ అనే బిరుదును తమకు తామే తగిలించుకుంటే అది చెల్లుబాటు కాదని రేవంత్ ఎద్దేవా చేశారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేవలం రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం కాకుండా, సిట్ విచారణలో అనేక కీలక అంశాలు బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కీలక అధికారుల అరెస్టులు, వారు ఇచ్చిన వాంగ్మూలాలు ఇప్పుడు బీఆర్ఎస్ అగ్రనేతలకు ఉచ్చుగా మారుతున్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు గమనిస్తే.. ఈ కేసులో ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని, ఆధారాలు ఉంటే ఎంతటి వారినైనా చట్టం ముందు నిలబెడతామని ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. రానున్న రోజుల్లో సిట్ విచారణ ఎటువైపు మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

cm revanth KCR Latest News in Telugu Phone Tapping Case SIT inquiry Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.