📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

CM Revanth : జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ బిగ్ డీల్

Author Icon By Sudheer
Updated: April 17, 2025 • 11:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని “తెలంగాణ రైజింగ్” బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. జపాన్‌కు చెందిన ప్రఖ్యాత సంస్థ మరుబెనీ, తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపింది. ముఖ్యంగా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ఆధునిక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. టోక్యోలో జరిగిన సమావేశంలో సీఎంతో మరుబెనీ ప్రతినిధులు కలిసి, లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI) పై సంతకాలు చేశారు.

సుమారుగా రూ.5,000 కోట్ల వరకు పెట్టుబడులు

ఈ పార్క్ ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్, ప్రెసిషన్ ఇంజినీరింగ్ వంటి రంగాలపై దృష్టి సారించనుంది. ప్రాజెక్టు ప్రారంభం అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు తమ తయారీ యూనిట్లను ఇక్కడ ఏర్పాటు చేయనున్నాయి. దీని ద్వారా సుమారుగా రూ.5,000 కోట్ల వరకు పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నట్లు అంచనా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో సుమారు 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని తెలిపారు. ఇది ఫ్యూచర్ సిటీలో మొదటి మెగా ప్రాజెక్ట్ కావడం గమనార్హం.

Revanth Reddy జపాన్ చేరుకున్న రేవంత్ రెడ్డి

ప్రస్తుతం 65 దేశాల్లో 410 గ్రూప్ కంపెనీలతో వ్యాపార కార్యకలాపాలు

మరుబెనీ సంస్థ ప్రస్తుతం 65 దేశాల్లో 410 గ్రూప్ కంపెనీలతో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోంది. వ్యవసాయం, ఫైనాన్స్, విద్యుత్, ఇంధనం, కెమికల్స్, ఏరోస్పేస్, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో ఈ సంస్థ విశ్వవ్యాప్తంగా పేరు పొందింది. తెలంగాణను పెట్టుబడులకు ఆదర్శ గమ్యస్థానంగా మలచేందుకు జపాన్ పర్యటన మరో కీలక అడుగుగా నిలిచింది. ఫ్యూచర్ సిటీని దేశంలోనే తొలి నెట్-జీరో సిటీగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Japan tour revanth

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.